[ad_1]
తిరుమల కొండకు..
ఇషా దంపతులకు పుట్టిన పిల్లల కోసం ప్రత్యేకంగా పూజలు చేసేందుకు అంబానీ కుటుంబం తిరుమలేసుడిని దర్శించుకున్నారు. వారి అభివృద్ధి కోసం తిరుమల ఆలయ పండితులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అంబానీ కుటుంబం 300 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సమాచారం.
నింగికంటిన సంబురాలు..
కొత్త వారసులను ఇండియాకు తీసుకురావటంతో అంబానీ నివాసం ఆంటిలియా, పిరమల్ నివాసం కరుణ సింధులలో సంబురాలు జరుగుతున్నాయి. వీరి రాకకోసం ఆ ఇళ్లలో ప్రత్యేక ఏర్పాటు సైతం చేసినట్లు సమాచారం. ఇంట్లోకి సూర్యకాంతి నేరుగా పడేందుకు వీలుగా ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్స్ పెర్కిన్స్ అండ్ విల్ ఆధ్వర్యంలో కొన్ని ఏర్పుట్లు కూడా జరిగాయి. దీనికి తోడు పిల్లల కోసం బ్రాండెడ్ డిజైనర్ వేర్, ప్రయాణానికి ప్రత్యేక వాహనాలు సైతం అంబానీ కుటుంబం అందుబాటులోకి తెచ్చేసింది.
పిల్లల కోసం..
చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సుశిక్షితులైన 8 మంది నర్సులను ఇండియాకు తీసుకొచ్చారు. వీరికి తోడు అమెరికాలో అత్యుత్తమ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్బన్ కూడా వీరి వెంట వచ్చారు. ప్రస్తుతం మనవడు, మనవరాలు రాకతో ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు మురిసిపోతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply