Mukesh Ambani: ఆ కంపెనీలో అంబానీ ఇన్వెస్ట్ చేసి తప్పుచేశారా..? వేల కోట్లు గంగపాలేనా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Mukesh
Ambani:

దేశంలో
అగ్రవ్యాపారవేత్త,
బిలియనీర్
ముఖేష్
అంబానీ

పనినైనా
ముందుచూపుతోనే
చేస్తుంటారు.
అందుకే
ఆయన
ఇన్ని
దశాబ్ధాలుగా
తన
తండ్రి
ధీరూ
భాయ్
అంబానీ
నిర్మించిన
సామ్రాజ్యాన్ని
విజయవంతంగా
ముందుకు
నడుపుతున్నారు.

అయితే
గత
ఏడాది
నుంచి
రిలయన్స్
గ్రూప్
తన
వ్యాపారాన్ని
చాలా
వేగవంతంగా
ముందుకు
తీసుకెళ్లేందుకు
అనేక
పెట్టుబడులను
పెడుతోంది.
ఇందులో
భాగంగా
రిలయన్స్
రిటైల్
వెంచర్స్
జూలై
2021లో
JustDial
కంపెనీలో
67
శాతం
వాటాను
రూ.5,700
కోట్లు
వెచ్చించి
కొనుగోలు
చేసింది.
అయితే

డీల్
జరిగి
రెండేళ్లు
గడుస్తున్నా
అంబానీ
లక్ష్యం
దిశగా
అడుగులు
పడటం
లేదని
తెలుస్తోంది.

Mukesh Ambani: ఆ కంపెనీలో అంబానీ ఇన్వెస్ట్ చేసి తప్పుచేశారా.

జస్ట్
డయల్
వద్ద
దాదాపు
మూడున్నర
కోట్ల
మంది
వ్యాపారాలకు
సంబంధించిన
లిస్టింగ్‌ల
డేటాబేస్
ఉంది.
అలాగే
మార్చి
31,
2021
నాటికి
కంపెనీ
వద్ద
129.1
మిలియన్ల
ప్రత్యేక
వినియోగదారుల
డేటా
కలిగి
ఉంది.
అయితే

ట్రాఫిక్
వాడుకోవటంలో
రిలయన్స్
లక్ష్యాన్ని
చేరుకోలేకపోయింది.
జస్ట్
డయల్‌
బోర్డులో
రిటైల్
వెంచర్స్
నుంచి
ప్రాతినిధ్యం
ఉన్నప్పటికీ
వ్యాపార
నిర్వహణలో
వ్యవస్థాపకులు
VSS
మణి,
అభిషేక్
బన్సల్
ఆధిపత్యం
కొనసాగుతోందని
వెల్లడైంది.
అలాగే
కంపెనీ
తన
ప్రొడక్ట్
అండ్
టెక్నాలజీ
టీమ్
నుంచి
100
మందిని
లేఆఫ్
చేసింది.

దేశం
వేగంగా
డిజిటలీకరణ
వైపు
పయనిస్తున్న
వేళ..
జరుగుతున్న
వ్యాపార
వాతావరణం
మార్పు
కంటే
చాలా
నెమ్మదిగా
మణి
కంపెనీని
నడుపుతున్నారని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.
కొత్త
లోకల్
ఎకానమీలోకి
విస్తరించాలని
జస్ట్
డయిల్
చేస్తున్న
ప్రయత్నాలు
నిధుల
విబేధాలతో
పునఃపరిశీలనలో
ఉన్నాయి.
బోర్డు
స్థాయిలోనే
రిలయన్స్
గ్రూప్
ప్రమేయం
ఉంటుందని..
జస్ట్
డయల్
స్వతంత్ర
లిస్టెడ్
సంస్థగా
కొనసాగుతుందని
బన్సాల్
ఇటీవల
ఇన్వెస్టర్లతో
మాట్లాడుతూ
చెప్పారు.
కొత్త
అవకాశాలను
అందిపుచ్చుకుని..
వ్యాపారాన్ని
వీలైనంత
త్వరగా
తిరిగి
గాడిలోకి
తెచ్చేందుకు
కొత్త
రీసెల్లింగ్
మోడల్
తో
ముందుకు
రానున్నట్ల
బన్సాల్
తెలిపారు.

ప్రస్తుతం
జస్ట్
డయిల్
కంపెనీ
షేరు
రూ.737
వద్ద
ఉంది.
గడచిన
ఏడాది
కాలంలో
స్టాక్
30
శాతానికి
పైగా
రాబడిని
అందించింది.
అయితే
అంబానీ
లక్ష్యాలకు
అనుగుణంగా
కంపెనీ
నడవటం
లేదని
మార్కెట్
వర్గాలు
అభిప్రాయపడుతున్నాయి.

English summary

Mukesh ambani’s investment in JustDial is big mistake, Know in detail

Mukesh ambani’s investment in JustDial is big mistake, Know in detail

Story first published: Saturday, June 24, 2023, 15:47 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *