[ad_1]
ఆరోగ్య రంగంలో..
ఇండియన్ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఆరోగ్య రంగంలోని జన్యు మ్యాపింగ్‌లోకి ప్రవేశిస్తోంది. అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయులందరికీ అందుబాటులో సేవలను మార్కెట్లోకి తీసుకురావాలని సమ్మేళనం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఈ సంస్థ నుంచి ఎవరైనా అమెరికన్ తమ పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్య నివేదికలను కేవలం $99కి కొనుగోలు చేయవచ్చు.
మరికొన్ని వారాల్లో..
రానున్న మరికొన్ని వారాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షను కేవలం రూ.12,000కే నిర్వహించేందుకు వీలుగా కిట్ లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఉత్పత్తిని అభివృద్ధి చేసిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ హరిహరన్ తెలిపారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ చేపడుతున్న కొత్త జీనోమ్ టెస్టింగ్ భారతదేశానికి “ప్రమాణాలను నిర్దేశిస్తుంది” అని హరిహరన్ అన్నారు. “మేము సైన్స్‌కు దగ్గరగా ఉండటం ద్వారా బాధ్యతాయుతమైన వినియోగదారుగా జన్యుశాస్త్రాన్ని అందిస్తాము.” అని అన్నారు.
అత్యంత చౌకగా..
ప్రస్తుతం దేశంలో ఉన్న ఇతర ఆఫర్‌ల కంటే దాదాపు 86% తక్కువ ఖర్చుకే జీనోమ్ టెస్ట్, క్యాన్సర్‌లు, కార్డియాక్, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులకు సంబంధించి వ్యక్తుల పూర్వస్థితిని వెల్లడి చేయగలదని హరిహరన్ తెలిపారు. అలాగే వారసత్వంగా వచ్చే జన్యుపరమైన రుగ్మతలను గుర్తించేందుకు ఈ జీనోమ్ మ్యాపింగ్ పరీక్షలు దోహదపడతాయని ఆయన చెప్పారు. దేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు సరసమైన వ్యక్తిగత జన్యు-మ్యాపింగ్‌ను తీసుకురావడానికి ప్రాజెక్ట్ దోహదపడనుందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే చౌకగా..
ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన జెనోమిక్ ప్రొఫైల్ అవుతుందని హరిహరన్ పేర్కొన్నారు. అనారోగ్యాల నివారణకు ఇదొక ఆచరణీయమైన మార్గం కావటంతో ఈ వ్యాపారంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు తాము తక్కువ ధరతో మార్కెట్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ డ్రగ్ డెవలప్‌మెంట్, వ్యాధి నివారణకు సహాయపడే బయోలాజికల్ డేటా నిధిని సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ డ్రగ్‌మేకర్‌లు కొత్త ఔషధాలను అభివృద్ధి చేసేందుకు జన్యుసంబంధమైన డేటా దోహదపడుతుందని తెలుస్తోంది.
[ad_2]
Source link
Leave a Reply