[ad_1]
అంగారక గ్రహంపై ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2021లో ప్రయోగం చేపట్టింది. పర్స్‌వర్సెన్ రోవర్‌లో మాక్సీ (మార్స్ ఆక్సిజన్ ఇన్-ఎస్ఐటీయూ రిసోర్స్ యూటిలైజేషన్) అనే పరికరాన్ని అంగారకుడిపైకి పంపించింది. అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండింగ్ అయిన ఉపగ్రహం.. అక్కడ ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని.. 122 గ్రాముల ఆక్సిజన్‌ని విడుదల చేసినట్టు తాజాగా నాసా వెల్లడించింది. ఈ ఆక్సిజన్‌ను పరీక్షించగా.. అది 98 శాతం స్వచ్ఛమైనదిగా తేలిందని నాసా తెలిపింది. అయితే తాము నిర్దేశించిన లక్ష్యం కంటే ఇది రెట్టింపు ఫలితాల్ని రాబట్టిందని.. నాసా సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఆక్సిజన్ ఇంధనం, శ్వాస ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. మాక్సీ అసాధారణమైన పనిచేసిందని.. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణంలోని ఒక్కో కార్బన్ అణువుని తీసుకొని ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేసిందని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో అంగారకుడిపైకి పంపించే వ్యోమగాములకు ఆక్సిజన్ అందించడం సులువైందని పేర్కొంది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తయారు చేసిన మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్‌ను నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించింది. ఇది చంద్రుడు అంగారక గ్రహాలపై వనరులను ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ తెలిపారు. అంగారక గ్రహంపై అన్వేషణకు చేసే ప్రయోగాలు ముందుకు సాగేందుకు ఇది చాలా కీలకమని చెప్పారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply