NSE: నిఫ్టీ నెక్స్ట్ 50లోకి అదానీ విల్మార్.. ఎన్ఎస్ఈ సమీక్షలో నిర్ణయం..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(NSE) తన అర్ధ-వార్షిక సమీక్షలో నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ నెక్స్ట్ 50 సహా మొత్తం 42 ఇండెక్స్ స్టాక్‌లలో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 17న ప్రకటన చేసింది. అదానీ విల్మార్ నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100 సూచికలలో చేర్చారు. అదానీ పవర్ కూడా నిఫ్టీ 500లో భాగం కానుంది. ఇది కాకుండా, అదానీ పవర్ నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250, నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 ఇండెక్స్‌లలో చేర్చారు.

ఈ మార్పులన్నీ మార్చి 31, 2023 నుంచి అమల్లోకి వస్తాయని NSE ప్రకటనలో తెలిపింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అదానీ విల్‌మార్‌తో పాటు ఎబిబి ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ ఉండగా, నిఫ్టీ 50 ఇండెక్స్ నుంచి బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, పేటీఎంతో పాటు ఎంఫసిస్ తీసేశారు. అయితే, నిఫ్టీ తన టైమ్ వారీ రివ్యూలో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఎలాంటి మార్పు చేయలేదు.

NSE: నిఫ్టీ నెక్స్ట్ 50లోకి అదానీ విల్మార్.. ఎన్ఎస్ఈ సమీక్ష

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి నిఫ్టీ 50 నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌ను మినహాయించాలని డిమాండ్ వచ్చింది. కానీ ఎన్ఎస్ఈ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన తర్వాత, అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్షీణత వచ్చింది. అంతే కాకుండా అదానీలో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీ, అప్పులిచ్చిన ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లు ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

English summary

Adani Wilmar has been included in NSE Nifty Next 50

The National Stock Exchange of India (NSE) has changed all 42 index stocks including Nifty 50, Nifty 500, Nifty Next 50 in its half-yearly review. An announcement was made in this regard on February 17.

Story first published: Saturday, February 18, 2023, 12:06 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *