Nykaa share: మార్కెట్లోకి నైకా Q3 ఫలితాలు.. నిపుణుల ప్రకారం స్టాక్ ఎంత పెరగొచ్చంటే..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Nykaa share: దేశంలో ఐపీవోగా వచ్చిన బ్యూటీ స్టార్టప్ నైకా చాలా సంచలనాలను సృష్టించింది. అయితే ఆ తర్వాత స్టాక్ విలువ క్షీణించటం గురించి ఇన్వెస్టర్లకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా కంపెనీ తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.

ఫల్గుణి నాయర్ నేతృత్వంలోని కంపెనీ మిశ్రమ త్రైమాసిక ఫలితాలను నివేదించడంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa) షేర్లు 5 శాతం పడిపోయాయి. ఉదయం 11.51 గంటల సమయంలో షేర్ ధర రూ.142.70గా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.8.19 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 70.67 శాతం తక్కువ కావటం ఆందోళనకు గురిచేస్తోంది.

Nykaa share: మార్కెట్లోకి నైకా Q3 ఫలితాలు..

ఫలితాల తర్వాత స్టాక్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. అయితే ఈ క్రమంలో చాలా బ్రోకరేజ్ కంపెనీలు స్టాక్ టార్గెట్ ధర అంచనాలను తగ్గించాయి. అయితే రానున్న కాలంలో స్టాక్ రూ.250 మార్కును తాకవచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ధర కంటే ఇది దాదాపు 75 శాతం కంటే ఎక్కువని చెప్పుకోవాలి. చాలా బ్రోకరేజ్ కంపెనీలు స్టాక్ కు బై రేటింగ్ ఇస్తున్నాయి.

English summary

Brokerages bullish over Nykaa share price after bad Q3 results

Brokerages bullish over Nykaa share price after bad Q3 results

Story first published: Tuesday, February 14, 2023, 12:05 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *