OYO IPO: దీపావళి నాటికి ఒయో ఐపీఓ.. ఇష్యూ సైజ్‍ను తగ్గించిన సంస్థ..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

హాస్పిటాలిటీ టెక్ సంస్థ ఒయో(OYO)ని నిర్వహిస్తున్న ఒరావెల్ స్టేస్ శుక్రవారం స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ను ఫైల్ చేసింది . PTI OYO ఈ ఏడాది దీపావళి నాటికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) తీసుకురావొచ్చని కంపెనీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. సెబీ ఆమోదం లేదా తుది పరిశీలన తర్వాత 12 నెలలలోపు కంపెనీలు IPOని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇష్యూ పరిమాణం $400-600 మిలియన్లకు తగ్గించినట్లు తెలుస్తోంది.

ఒయో దాని IPO పరిమాణాన్ని మూడింట రెండు వంతుల తగ్గించింది. సాఫ్ట్‌బ్యాంక్ ఈ స్టార్టప్‌లో సగం వాటాను కలిగి ఉంది. కంపెనీ FY2024లో అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.800 కోట్ల ఆదాయం ఆశిస్తున్నామని ఒయో కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ చెప్పారు.తమ వద్ద ప్రస్తుత నగదు బ్యాలెన్స్ సుమారు రూ.2,700 కోట్లు ఉందన్నారు. ప్రస్తుత కార్యకలాపాల కోసం చాలా తక్కువగా వినియోగించుకుంటామన్నారు. తమ నగదు ప్రవాహం మెరుగుపడిందన్నారు.

దీపావళి నాటికి ఒయో ఐపీఓ.. ఇష్యూ సైజ్‍ను తగ్గించిన సంస్థ..

OYOను 2012లో రితేష్ అగర్వాల్ ప్రారంభించారు. OYOకి మైక్రోసాఫ్ట్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, ఇతర సంస్థలు కూడా మద్దతు ఇస్తున్నాయి.

English summary

OYO submitted DRHP to sebi, ipo issue size reduced

Oravel Stays, which runs hospitality tech firm OYO, on Friday filed its draft red herring prospectus with stock market regulator Sebi.

Story first published: Saturday, April 1, 2023, 11:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *