PAN Card: ఒక్క పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు..! త్వరలో కేంద్రం నిర్ణయం..

[ad_1]

13 విభిన్న వ్యాపార IDలు

13 విభిన్న వ్యాపార IDలు

ప్రస్తుతం EPFO, ESIC, GSTN, TIN, TAN, PAN వంటి 13 విభిన్న వ్యాపార IDలు వివిధ ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేయడానికి ఉపయోగించబడుతున్నాయి. పైన పేర్కొన్న ఐడీ కార్డలను ఉపయోగించి అప్రూవల్‌ పొందాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఆ సమస్యను అధిగమించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్క పాన్‌ కార్డుతో అనుమతులు ఇచ్చేలా నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టం పద్దతిని అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది.

రెవెన్యూ శాఖ

రెవెన్యూ శాఖ

ఈ విషయంపై తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెవెన్యూ శాఖను సంప్రదించిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. “మేము ఇప్పటికే ఉన్న డేటాబేస్‌లలో ఒకదానిని ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. పాన్‌తో, కంపెనీకి సంబంధించిన చాలా ప్రాథమిక డేటా , దాని డైరెక్టర్లు, చిరునామాలు, చాలా సాధారణ డేటా ఇప్పటికే పాన్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి” అని గోయల్ చెప్పారు.

ఆటో-పాపులేట్

ఆటో-పాపులేట్

పాన్ నంబర్‌ను ఉపయోగించడం వల్ల సిస్టమ్‌లో స్వీకరించే ఇతర దరఖాస్తు ఫారమ్‌లను ఆటో-పాపులేట్ చేయడంలో సహాయపడుతుందన్నారు. ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, సిస్టమ్‌లో దరఖాస్తు చేసుకునేలా మరిన్ని కంపెనీలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థ ప్రస్తుతం రాష్ట్రాలతో సహా 26 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి 248 ప్రభుత్వ-వ్యాపార క్లియరెన్స్ మరియు అనుమతుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటకతో సహా ఇప్పటివరకు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 27 కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఇప్పటికే ఈ సిస్టమ్‌లో ఉన్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *