Paytm Share: పేటీఎం వాటాలు కోరుతున్న ఎయిర్‌టెల్ యజమాని.. పెద్ద స్కెచ్చే..!

[ad_1]

సునీల్ మిట్టల్..

సునీల్ మిట్టల్..

భారతీయ టెలికమ్యూనికేషన్ దిగ్గజం ఎయిర్‌టెల్ యజమాని సునీల్ మిట్టల్ పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఆయన తన ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను ఫిన్‌టెక్ దిగ్గజం పేమెంట్స్ బ్యాంక్‌లో విలీనం చేయడం ద్వారా Paytmలో వాటా కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇది ఇరు కంపెనీలకూ లాభదాయకమైన డీల్ అని చెప్పుకోవచ్చు.

ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్..

ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్..

మిట్టల్ స్టాక్స్ డీల్‌లో Airtel Payments Bankని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇతర హోల్డర్‌ల నుంచి Paytm షేర్లను కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి.

అయితే త్వరలోనే Airtel, Paytm ఒప్పందం కుదుర్చుకోకపోవచ్చని ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం 129 మిలియన్ల మంది కస్టమర్లకు కలిగి ఉంది.

కనిష్ఠాల నుంచి రికవరై..

కనిష్ఠాల నుంచి రికవరై..

పేటీఎం వ్యాపారం లాభదాయకంగా మారుతున్నట్లు సంకేతాలను చూపుతున్నందున నవంబర్ లో రికార్డు కనిష్ఠ స్థాయి నుంచి షేర్ దాదాపు 40 శాతం వరకు పుంజుకుంది. ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ వివరాల ద్వారా వెల్లడైంది.

బలమైన ధరతో 2021 నవంబరులో పేటీఎం కంపెనీ రూ.2,150 ధరకు ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం కంపెనీ స్టాక్ ధర రూ.622 వద్ద ట్రేడవుతోంది. బ్రోకరేజ్ కంపెనీలు పేటీఎం స్టాక్ కు రూ.944.64 టార్గెట్ ధరగా నిర్ణయించాయి.

జాక్ మా నిర్ణయం..

జాక్ మా నిర్ణయం..

చైనా దిగ్గజ వ్యాపారవేత్త జాక్ మా పేటీఎం కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. జాక్ మా కు సంబంధించిన ఫిన్ టెక్ విభాగం యాంట్ గ్రూప్ పేటీఎంలోని తన పెట్టుబడులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు మెుదలయ్యాయని తెలుస్తోంది.

డిసెంబర్ నాటికి యాంట్ గ్రూప్ పేటీఎంలో 24.86 శాతం వాటాలను కలిగి ఉంది. ఇదే సమయంలో సునీల్ మిట్టల్ తన పేమెంట్ బ్యాంక్ వ్యాపారాన్ని పేటీఎంతో కలపాలని చూస్తున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *