Pegatron Corp: భారత్‍లో రెండో పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైన పెగాట్రాన్ క్రాప్..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

Apple Inc తైవానీస్ సరఫరాదారు Pegatron Corp భారత్ లో రెండో ఫ్యాక్టరీ తెరవడానికి చర్చలు జరుపుతోంది. యూఎశ్ టెక్ దిగ్గజాలు చైనాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే భారత్ లో పెట్టుబడి పెట్టడానికి పెగాట్రాన్ క్రాప్ చర్చలు జరుపుతోంది. పెగాట్రాన్ తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రెండో తన రెండో పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మొదటి ఫ్యాక్టరీని 150 బిలియన్ డాలర్లలో ప్రారంభించింది. భారత్ లో రెండో పరిశ్రమ ఏర్పాటు పెగాట్రాన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. యాపిల్‌కు భారతదేశం తదుపరి వృద్ధికి ఆశజనకంగా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రకారం ఏప్రిల్ 2022, ఫిబ్రవరి, 2023 మధ్య భారత్ నుంచి సుమారు $9 బిలియన్ విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. అందులో 50% కంటే ఎక్కువ ఐఫోన్లే ఉన్నాయి.

Pegatron Corp: భారత్‍లో రెండో పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైన పెగ

పెగాట్రాన్ ప్రస్తుతం భారతదేశంలో వార్షిక ప్రాతిపదికన యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిలో 10% వాటాను కలిగి ఉందని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. యాపిల్ కోసం వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో $200 మిలియన్ల ఫ్యాక్టరీని నిర్మించాలని ఫాక్స్‌కాన్ ప్లాన్ చేస్తోంది. ఇది ఇప్పటికే తమిళనాడులోని తన ప్లాంట్‌లో కొన్ని ఐఫోన్ మోడల్‌లను అసెంబుల్ చేస్తుంది.

భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గా ఉంది. ఇక్కడ యాపిల్ ఐప్యాడ్ టాబ్లెట్‌లు, ఎయిర్‌పాడ్‌లను తయారు చేయాలన కంపెనీ యోచిస్తోంది. కర్ణాటకలో ఫాక్స్‌కాన్ $968 మిలియన్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 50,000 ఉద్యోగాల రానున్నాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, కోవిడ్ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తితో పెగాట్రాన్ భారత్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

Pegatron Corp plane for start second factory in india

Apple Inc’s Taiwanese supplier Pegatron Corp is in talks to open a second factory in India.

Story first published: Saturday, March 25, 2023, 17:39 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *