Penny Stock: రూపాయి స్టాక్ రికార్డుల మోత.. లక్ష పెట్టిన వారికి రూ.60 లక్షలు.. మీరు కొన్నారా..?

[ad_1]

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సన్మిత్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ స్టాక్ తన ఇన్వెస్టర్లకు నాలుగేళ్ల కాలంలో ఊహించని లాభాలను అందించింది. స్మాల్ క్యాప్ కంపెనీగా ఉన్న పెన్నీ స్టాక్ ధర రూ.1.31 స్థాయి నుంచి పెరిగి రూ.78.75కి చేరుకుంది. ఈ క్రమంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు దాదాపు రూ.5,900 శాతం రాబడిని అందించింది.

పెన్నీ స్టాక్ షేర్ ధర చరిత్ర..

పెన్నీ స్టాక్ షేర్ ధర చరిత్ర..

సన్మిత్ ఇన్‌ఫ్రా గత నెల పనితీరును పరిశీలిస్తే కంపెనీ షేరు ధర 8 శాతం లాభపడింది. కాగా 6 నెలల క్రితం సన్మిత్ ఇన్‌ఫ్రా షేర్ రేటు రూ.42 వద్ద ఉంది. అప్పటి నుంచి కంపెనీ షేరు ధర పైకి ఎగబాకి రూ.78.75 స్థాయికి చేరుకుంది. అంటే 6 నెలల కాలంలో కంపెనీ షేర్ 90 శాతం రాబడిని అందించింది. అదే సమయంలో 2022లో పొజిషనల్ ఇన్వెస్టర్ల రాబడి 160 శాతం మేర పెరిగింది.

కుషీగా ఇన్వెస్టర్లు..

కుషీగా ఇన్వెస్టర్లు..

6 నెలల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ స్మాల్ క్యాప్ కంపెనీ అయిన సన్మిత్ ఇన్‌ఫ్రాలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే ప్రస్తుతం దాని విలువ రూ.1.90 లక్షలయ్యేది. అలాగే నాలుగేళ్ల కిందట షేర్ ధర రూ.1.31గా ఉన్న సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే వారి పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.60 లక్షలకు చేరుకునేది. ఈరోజు ఉదయం 10.06 గంటల సమయంలో బీఎస్ఈలో స్టాక్ ధర రూ.76.55 వద్ద ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 85.70 ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.25.54గా ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

1965లో వ్యాపారాన్ని ప్రారంభించింది సన్మిత్ ఇన్‌ఫ్రా కంపెనీ. అంచెలంచెలుగా ఎదిగిన సన్మిత్ సంస్థ ముంబై నగరంలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్మించింది. దీనికి తోడు మహారాష్ట్రలోని చాలా నగరాల్లోనూ కట్టడాలను చేపట్టింది. బాంద్రాలోనూ అనేక కట్టడాలను విజయవంతంగా పూర్తి చేసింది. సన్మిత్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ బయో మెడికల్ వేస్ట్ క్రిమిసంహారక పరికరాల కోసం అత్యాధునిక కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. పర్యావరణ హితం కంపెనీ మహారాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ శ్మశానవాటిక వ్యవస్థను ప్రారంభించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *