[ad_1]
నువ్వులు..
నువ్వుల్లో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. దీని వల్ల త్వరగా పీరియడ్స్ వస్తాయి. వీటిని ఓ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటుండాలి. రోజుకి రెండుసార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అల్లం..
అల్లంలో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. దీనిని తీసుకోవడం వల్ల పొత్తికడుపు తిమ్మిరి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే..
అరటేబుల్ స్పూన్ అల్లం రసాన్ని
తేనెతో కలిపి తీసుకోవాలి.
రోజుకి రెండుసార్లు చేయడం వల్ల పీరియడ్స్ త్వరగా వస్తాయి.
Also Read : Weight Gain Foods : బరువు పెరగాలనుకుంటున్నారా.. వీటిని తినండి..
ఆముదం..
మీకు తెలుసా… ఆముదం వల్ల త్వరగా పీరియడ్స్‌ని రప్పించుకోవచ్చని. ఇందుకోసం అరటేబుల్ స్పూన్ ఆముదం తీసుకుని పొత్తికడుపుపై మసాజ్ చేసి వేడి క్లాత్ పెట్టండి. దీనిని 15 నుంచి 20 నిమిషాలు అలానే ఉంచండి. రోజుకి రెండుసార్లు ఇలా చేయొచ్చు.
కాఫీ..
కెఫిన్ ఎక్కువగా ఉన్న కాఫీ కూడా పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేస్తుంది. ఎలా తాగాలంటే.. పీరియడ్స్‌కి ముందు రోజుకి రెండు సార్లు కాఫీ తాగడం వల్ల మీకు త్వరగా పీరియడ్స్ వస్తాయి.
పసుపు..
కూరల్లో ఎక్కువగా వాడే పసుపు కూడా పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీ గర్బాశయ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా త్వరగా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది.
ఏం చేయాలంటే..
1 టీ స్పూన్
1 గ్లాసు నీరు
ఓ గ్లాసు నీటిలో పసుపు వేసి బాగా మరిగించి దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి.
దానిమ్మ..
దానిమ్మ పండ్లు కూడా పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేస్తాయి. పీరియడ్స్ ముందు టైమ్‌లో వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల త్వరగా పీరియడ్స్ వస్తాయి.
సోంపు..
సోంపు కూడా బాగా పనిచేస్తుంది. ఇది గర్భాశయంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ కారణంగా త్వరగా పీరియడ్స్ వస్తాయి. దీని కోసం ఏమేం కావాలంటే..
2 కప్పుల నీరు
1 టేబుల్ స్పూన్ సోంపు..
ముందుగా ఓ గిన్నెలో నీరు పోసి సోంపు వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన నీటిని వడకట్టి రెగ్యులర్‌గా తాగాలి.
క్యారెట్స్..
క్యారెట్స్‌లో బీటా కెరోటిన్, బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మీ గర్భాశయ లైనింగ్ షెడ్డింగ్‌ని ప్రేరేపిస్తాయి. వీటిని తినడం వల్ల త్వరగా పీరియడ్స్ వస్తాయి. రోజుకో క్యారెట్‌ని తీసుకోవడం వల్ల మీకు పీరియడ్స్ త్వరగా వస్తాయి.
పైనాపిల్..
పైనాపిల్‌లోని గర్భాశయ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల స్త్రీలలో గర్భాశయ సంకోచాలు ఉంటాయి. పీరియడ్స్ త్వరగా రావాలంటే ఈ పండుని తినడం మంచిది. వీటిని నేరుగా తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.
Also Read : Varicose veins : నిలబడినప్పుడు కాళ్ళలో నొప్పితో పాటు ఈ సమస్య కనిపిస్తుందా.. జాగ్రత్త..
విటమిన్ సి..
విటమిన్ సి అనేది బాడీలో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. ప్రొజెస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. విటమిన్ సి ఫుడ్స్‌ని తీసుకుంటే త్వరగా పీరియడ్ వస్తుంది. అయితే, ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోండి.
Also Read : Promise Day 2023 : పండంటి కాపురానికి పది ‘ప్రామిస్’లు
బొప్పాయి..
బొప్పాయి గురించి అందరికీ తెలిసిందే. ఇది గర్భాశయ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే గర్బాశయాన్ని సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల ముందుగానే పీరియడ్స్ వస్తుంది.
దీని కోసం మీరు బాగా పండిన బొప్పాయిని హ్యాపీగా తినొచ్చు. దీనిని జ్యూస్‌లా చేసి తాగొచ్చు కూడా. రోజుకి ఓ సారి జ్యూస్ తాగడం మంచిది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇది మరువొద్దు..
ఇప్పుడు చెప్పిన చిట్కాలన్నీ కూడా రెగ్యులర్‌గా వాడడం మంచిది కాదు. ఏదో ఓ సమయంలో అయితే పర్లేదు. రెగ్యులర్‌గా పీరియడ్స్ లేట్ అవుతుంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply