PF: పీఎఫ్ చందాదారులుగా కొత్తగా 14 లక్షల మంది చేరిక..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

పీఎఫ్ చందాదారులుగా కొత్తగా 14.86 లక్షల మంది చేరారు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన చేసింది. ఈ 14.86 లక్షల మంది సభ్యులలో, దాదాపు 7.77 లక్షల మంది కొత్త సభ్యులు ఉన్నారు. కొత్తగా చేరిన సభ్యులలో, అత్యధికంగా 2.26 లక్షల మంది సభ్యులు 18-21 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. 22-25 సంవత్సరాల వయస్సు గలవారు 2.06 లక్షల మంది ఉన్నారు. దాదాపు 3.54 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌వో పరిధికి దూరంగా ఉన్నారని, ఇది గత నాలుగు నెలల్లో కనిష్ట స్థాయి అని మంత్రిత్వ శాఖ వివరించింది.

2023 జనవరిలో 2.87 లక్షల మంది మహిళా సభ్యులు నమోదు చేసుకున్నారని, అందులో 1.97 లక్షల మంది కొత్త సభ్యులుగా ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం మహిళా సభ్యుల్లో 68.61 శాతం మంది మహిళలు తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారని చెప్పింది.
మహారాష్ట్ర నుంచి EPFO కొత్తగా చేరిన వారిలో ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రం జనవరి నెలలో EPFO ​​వాటాదారుల ఖాతాకు మొత్తం 22.73 శాతం సభ్యులు చేరారు. ఆ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది.

PF: పీఎఫ్ చందాదారులుగా కొత్తగా 14 లక్షల మంది చేరిక..

జనవరి నెలలో ఈపీఎఫ్‌ఓ చందాదారుల చేరిన వారిలో మ్యాన్‌పవర్ సప్లయర్లు, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సర్వీసెస్, మిక్స్‌డ్ యాక్టివిటీస్ ఉన్న ఉద్యోగులు 40.64 శాతంగా ఉన్నారు. ఇక చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం మారినపుడు పీఎఫ్ కు సంబంధించి కొత్త ఖాతా తెరుస్తారని, అలాంటి సందర్భాలలో పాత పీఎఫ్ ఖాతాను కొత్త ఖాతాతో అనుసంధానించుకోవాలని సూచిస్తున్నారు. పీఎఫ్ వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మందికి వడ్డీ జమ కాలేదు. దీనిపై చాలా మంది సమాజిక మాద్యమల్లో విమర్శలు చేస్తున్నారు.

English summary

14.86 lakh new pf subscribers joined in one month

14.86 lakh new people joined as PF subscribers. Union Ministry of Labor and Employment issued a statement in this regard on Monday.

Story first published: Tuesday, March 21, 2023, 14:40 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *