PM Kisan: పీఎం కిసాన్ 13వ విడత ఎప్పుడంటే..

[ad_1]

13వ విడత ఎప్పుడంటే

13వ విడత ఎప్పుడంటే

పలు మీడియా కథనాల ప్రకారం, ఫిబ్రవరి 24న 13వ విడత రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో ప్రారంభించారు. చివరిసారిగా అక్టోబర్ 17, 2022న ప్రధానమంత్రి కిసాన్ యోజన 12వ విడత డబ్బు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు.

eKYC

eKYC

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు డబ్బు రావాలంటే వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఇప్పటికీ మీరు ఈ కేవైసీ చేసుకోకుంటే వెంటనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ కు వెళ్లి చేసుకోండి. మీరు మీ PM కిసాన్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకుంటే, వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.

ప్రధానమంత్రి మంధన్ యోజన

ప్రధానమంత్రి మంధన్ యోజన

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ పథకంతో పాటు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన పథకం కూడా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మంధన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి నెలా రూ.3000 పింఛన్ వస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో రైతులు నెలవారీగా రూ.55 నుండి రూ.200 వరకు చందా చెల్లించాల్సి వస్తే, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత మీ ఖాతాలో రూ.3000 పింఛను జమ అవుతాయి. అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే దీనికి అర్హులు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *