[ad_1]
ఆనంద్ మహీంద్రా..
ప్రధాని మోదీ మాతృవియోగం పొందటంపై దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఆ సందర్భంలో ఆయన తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. వ్యాపార ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు ఈ దుఃఖ సమయంలో ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మోదీ తల్లి మరణంపై చాలా ఎమోషనల్ ట్వీట్ చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
|
మహీంద్రా ఏమన్నారంటే..
“తల్లి ఏ వయస్సులో ఉన్నా.. ఆమెను కోల్పోవడం ఆత్మలో ఒక భాగాన్ని కోల్పోయినట్లే. శ్రీ నరేంద్ర మోదీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ మహీంద్రా తన బాధను వ్యక్తపరిచారు. తల్లితో ప్రధాని మోదీకి ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. అయితే తల్లి మరణంపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు.
|
మోదీ తల్లికి ఏమైంది..?
ప్రధాని తల్లి హీరాబెన్ రెండు రోజుల కిందట అకస్మాత్తుగా తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. ఆమెను వెంటనే అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్‌లో చేర్చారు. నిన్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. తల్లి మరణవార్తతో ప్రధాని వెంటనే అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ తల్లి మరణవార్తతో దేశవ్యాప్తంగా ప్రజలు విషాదంలో మునిగిపోయారు. జపాన్ ప్రధానితో పాటు నేపాల్ దహల్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు.
[ad_2]
Source link
Leave a Reply