[ad_1]
News
oi-Mamidi Ayyappa
Poultry
Business:
తెలుగు
రాష్ట్రాల్లో
ఎండలు
రికార్డు
స్థాయిల్లోనే
కొనసాగుతున్నాయి.
వానలు
ఎప్పుడు
పడతాయా
అని
ప్రజలు,
రైతన్నలు
ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు
ఈ
ప్రభావం
పౌల్ట్రీ
రంగాన్ని
కుదిపేస్తోంది.
విపరీతమైన
ఉష్ణోగ్రతలతో
వేసవిలో
46
డిగ్రీల
గరిష్ఠ
స్థాయికి
ఎండలు
నమోదయ్యాయి.
ఈ
క్రమంలో
పెరిగిన
వడగాల్పులు
కోళ్ల
పెంపకాన్ని
దెబ్బతీస్తున్నాయి.
అధిక
వేడికి
తట్టుకోలేక
కోళ్లు
అధిక
సంఖ్యలో
చనిపోవచం
పౌల్టీ
రైతులను
కోలుకోకుండా
చేస్తున్నాయి.
ఈ
క్రమంల
మాంసం
రేట్లు
భారీగా
పెరిగాయి.
కిలో
లైవ్
కోడి
ధర
రూ.195కి
చేరగా..
స్కిన్
లెస్
రూ.320,
విత్
స్కిన్
రేటు
రూ.290
వద్ద
ఉంది.
ఏప్రిల్
నెలలో
కిలో
చికెన్
రేటు
రూ.150
స్థాయిలో
ఉంది.
కొన్ని
చోట్ల
ఇవి
రూ.400
దగ్గరకు
చేరుకున్నాయి.
లేయర్స్
ఫామ్స్
నడిపే
రైతులకు
పెరిగిన
ఎండ
వేడి,
వడగాలులకు
తోడు
భారీగా
పెరిగిన
దాణా
ఖర్చులు
భారంగా
మారాయి.
వీటి
పెంపకం
ప్రారంభించిన
తర్వాత
విక్రయానికి
రావటానికి
దాదాపు
40
రోజులు
పడుతుంది.
అయితే
ఈ
ఏడాది
విపరీతమైన
ఎండల
కారణంగా
కోళ్లు
కిలోన్నర
బరువు
పెరగటానికి
45-60
రోజులు
పడుతోంది.
అలాగే
ఎగ్స్
బ్రీడింగ్
కూడా
కష్టతరం
అవుతోందని
పరిశ్రమ
వర్గాలు
చెబుతున్నాయి.
ఇవి
ఉత్పత్తి
తగ్గుదలకు
కారణమయ్యాయి.
దీంతో
తెలంగాణలోని
అనేక
జిల్లాల్లో
మెుత్తంగా
కోళ్ల
పెంపకం
దాదాపు
32
శాతం
పడిపోయింది.
అలాగే
మరణాల
రేటు
14
శాతానికి
చేరుకుంది.
ఇదే
సమయంలో
దాణాకు
వినియోగించే
సోయా,
మెుక్కజొన్న
ధరలు
విపరీతంగా
పెరిగాయి.
గతంలో
మెుక్కజొన్నను
సబ్సిడీపై
అందించిన
తెలంగాణ
ప్రభుత్వం
దానిని
రెండేళ్లుగా
నిలిపివేయటం
రైతులకు
భారాన్ని
పెంచింది.
పైగా
పెళ్లిళ్లు,
ఫంక్షన్లు
పెరగటం
కూడా
డిమాండ్
పెరుగుదలకు
కారణంగా
మారింది.
మహారాష్ట్రలో
చికెన్
ధర
తక్కువగా
ఉండటంతో
వ్యాపారులు
అక్కడి
నుంచి
కోళ్లను
కొనటం
తమకు
నష్టాలను
తెచ్చిపెడుతోందని
పౌల్ట్రీ
యజమానులు
చెబుతున్నారు.
తెలంగాణలో
మెుత్తం
జనాభాలో
దాదాపు
96
శాతం
మంది
మాంసాహార
ప్రియులు
ఉండటం..
అందులోనూ
40
శాతానికి
పైగా
ప్రజలు
చికెన్
తినటంతో
డిమాండ్
కు
తగ్గట్లు
ఉత్పత్తి
కొరవడి
ధరలు
పెరుగుతున్నాయి.
అయితే
వర్షాకాలం
వస్తే
సమస్య
తగ్గుతాయని
నిపుణులు
చెబుతున్నారు.
గుడ్ల
విషయంలోనూ
ఇవే
పరిస్థితులు
కనిపిస్తున్నాయి.
English summary
Chicken rates at peak with heat waves in telangana, Know in detail
Chicken rates at peak with heat waves in telangana, Know in detail
Story first published: Thursday, June 15, 2023, 13:31 [IST]
[ad_2]
Source link
Leave a Reply