Power tariffs: బీహార్ లో విద్యుత్ బిల్లులపై భారీ వడ్డింపు.. ఏప్రిల్ 1 నుంచి బాదుడు షురూ..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Power tariffs: దేశాన్ని విద్యుత్ కొరత తీవ్రంగా వేదిస్తోంది. వేసవిలోకి ప్రవేశిస్తుండగా డిమాండ్ కు తగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచేందుకు, కరెంట్ కోతలు లేకుండా చూస్తేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయి. ఇదే విషయంపై కేంద్రం సైతం పలు రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. బొగ్గు దిగుమతి, థర్మల్ ప్లాంట్ల పూర్తిస్థాయి వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులపై ఆందోళన నెలకొంది.

ఇప్పటికే ఫిర్యాదులు:

2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను విద్యుత్ టారిఫ్ ను 24.10 శాతం పెంచుతూ.. బీహార్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (BERC) నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ మేరకు బేస్ ఫీజును పెంచింది. కొత్త టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలు విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా నియంత్రణ సంస్థ తాజా చర్యలు సామాన్యులపై అదనపు భారాన్ని మోపనున్నాయని వాపోతున్నారు.

Power tariffs: బీహార్ లో విద్యుత్ బిల్లులపై భారీ వడ్డింపు..

రెండింతలైన ఫిక్స్డ్ చార్జీలు:

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.20 ఫిక్స్‌డ్‌ చార్జీ ఉండగా.. ఇప్పుడు వినియోగదారులు దానికి రెండింతలు అంటే రూ.40 చెల్లించాల్సి వస్తుంది. మొదటి 50 యూనిట్లకు రూ.6.10 చార్జీని రూ.8.66కు పెంచారు. నెలకు రూ.40 కడుతున్న పట్టణ వినియోగదారులపై రూ.100 వడ్డించారు. ఇక 100 యూనిట్లు దాటితే మాత్రం యూనిట్‌ కు రూ.10.35 వదిలించుకోవాల్సిందే.

డిస్కంలు 40 శాతం సిఫార్సు చేసినా..

బీహార్‌లో మొత్తం రెండు డిస్కమ్ బాడీలు ఉన్నాయి. నార్త్ బీహార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NBPDCL) మరియు సౌత్ బీహార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (SBPDCL). విద్యుత్ ఛార్జీలను 40 శాతం పెంచాలని వాటి అధికారులు సిఫార్సు చేశారు. అయితే BERC మాత్రం 24.10 శాతం పెంపునకు మాత్రమే అనుమతించడం కొసమెరుపు.

English summary

Bihar increases power tariffs upto 24.10 percent

Bihar power tariff increase

Story first published: Friday, March 24, 2023, 19:33 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *