Q3 Results: అదరొట్టిన HDFC.. ఊహించని లాభాల్లో టాటా స్టాక్.. టైటాన్ టైమ్ బాలేదా..!

[ad_1]

టాటా కన్జూమర్..

టాటా కన్జూమర్..

రోజువారీ అవసరాలకు వినియోగంచే చాలా వస్తువులు టాటా కంపెనీకి సంబంధించినవే ఉంటుంటాయి. వీటిని తయారు చేసే టాటా కన్జూమర్ డిసెంబరు మాసంతో ముగిసిన త్రైమాసికానికి మంచి లాభాలను నమోదు చేసింది.

ఈ కాలంలో కంపెనీ లాభం 28 శాతం పెరిగి రూ.369 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో రెవెన్యూ రూ.3,454 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.287 కోట్లుగా ఉంది.

టైటాన్ టైమ్ బాలేదా..?

టైటాన్ టైమ్ బాలేదా..?

దివంగత ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలాకు అత్యంత ఇష్టమైన కంపెనీ టైటాన్ అని మనందరికీ తెలుసు. ఆయనకు కాసుల వర్షం కురిపించిన ఈ కంపెనీ తాజా ఫలితాలు నిరాశకు గురిచేశాయి. ఈ క్రమంలో కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను గమనిస్తే లాభం 10 శాతం మేర తగ్గి రూ.904 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.1,004 కోట్లుగా ఉంది.

HDFC..

HDFC..

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తన మూడో త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. కంపెనీ నికర లాభం 13 శాతం మేర పెరిగింది. దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC డిసెంబర్ త్రైమాసికంలో రూ.3,690.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీనికి ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,260.69 కోట్లుగా నమోదైంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *