Raksha Bandhan Gifts : రాఖీ పండుగకి అక్కాచెల్లెళ్లకి ఈ హెల్దీ గిఫ్ట్స్ ఇవ్వండి..

[ad_1]

హెర్బల్ టీ కిట్..

హెర్బల్ టీ కిట్..

ఇప్పుడు చెప్పే గిఫ్ట్ ఐడియాస్ అన్నీ కూడా హెల్త్ రిలేటెడ్. ఈ నేపథ్యంలోనే మీ తోబుట్టువులకి హెల్త్‌కి మేలు చేసే హెర్బల్ టీ కిట్ ఇవ్వొచ్చు. ఇందులో గ్రీన్ టీ, పుదీనా టీ, తులసి టీ, అశ్వగంధ, చమోమిలే వంటి హెర్బల్ టీ కిట్స్‌ని కూడా ఇవ్వొచ్చు.
Also Read : Carrots : రోజూ క్యారెట్స్ తిన్నా, జ్యూస్ తాగినా.. ఈ సమస్యలన్నీ దూరం..

స్మార్ట్ వాచెస్..

స్మార్ట్ వాచెస్..

నేడు అందరూ కూడా స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు. వీటిని కూడా మంచి గిఫ్టింగ్ పర్పస్‌గా తీసుకోవచ్చు. వీటిలో హార్ట్ మానిటరింగ్, ఫుట్ స్టెప్స్ ఇలా ఎన్నో హెల్దీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా ఏం చక్కా ఇవ్వొచ్చు.

రన్నింగ్ షూస్..

రన్నింగ్ షూస్..

మీ సిస్టర్ ఫిట్‌‌నెస్ ఫ్రీక్ అయితే.. ఆమెకి షూ కూడా ఇవ్వొచ్చు. ఇవి అంత కాస్ట్‌లీ కూడా ఉండవు. బడ్జెట్‌లోనే దొరుకుతాయి. మంచి బడ్జెట్‌లోనే ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే, తీసుకునేవి కంఫర్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇవి అన్ హెల్దీ ఫుడ్స్ కంటే చాలా మంచిది.
Also Read : Liver Problems : బరువు పెరిగితే కాలేయానికి ఈ సమస్య వస్తుందట.. జాగ్రత్త

జిమ్ మెంబర్ షిప్..

జిమ్ మెంబర్ షిప్..

నేడు మహిళలు ఇల్లు, ఆఫీస్ అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి బాడీపై వారు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు వారికి సంవత్సరమంతా గుర్తుండేలా జిమ్ మెంబర్ షిప్ ఇవ్వొచ్చుగా.. అలా మీరు ఆమెని హెల్దీగా మార్చొచ్చు. నేడు జిమ్స్‌లో ఇయర్ ప్యాకేజెస్ ఉంటాయి. హాఫ్ ఇయర్ ఉంటాయి. సో..ఇలా తీసుకుంటే మనీ తక్కువ అవుతుంది. పైగా మీరు మీ తోబుట్టువుని హెల్దీగా మార్చొచ్చు.

హెల్త్ చెకప్స్..

హెల్త్ చెకప్స్..

అదే విధంగా మీరు మీ సిస్టర్ హెల్దీగా ఉండేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలనుకుంటే తన కోసం హెల్త్ చెకప్స్ ప్యాకేజ్ తీసుకోండి. దీంతో తన హెల్త్ కండీషన్ మీరు, తను కూడా తెలుసుకుని కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తక్కువ బడ్జెట్‌లో ఉంటూనే వారి హెల్త్‌ని కాపాడతాయి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినవి, మీ తోబుట్టువులు మెచ్చేవి ఆలోచించి గిఫ్ట్ ప్లాన్ చేయండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు..

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *