[ad_1]
News
oi-Mamidi Ayyappa
Ratan
Tata:
రతన్
టాటా
భారత
వ్యాపార
ప్రపంచంలో
పరిచయం
అవసరం
లేని
వ్యక్తి.
ఉప్పు
నుంచి
విమానాల
వరకు
టాటాలు
చేయని
వ్యాపారం
లేదనటం
అతిశయోక్తి
కాదు.
దేశం
కోసం
పనిచేస్తున్న
అతిపెద్ద
గ్రూప్
టాటాలు.
రతన్
టాటా
చాలా
తక్కువగా
మాట్లాడుతూ
ఎక్కువ
ఫలవంతమైన
పనులను
చేస్తుంటారు.
ఏదైనా
ఆలోచనను
ముందుకు
తీసుకెళ్లాలనుకున్నప్పుడు
అందులో
ఎన్ని
ఆటుపోట్లు
ఎదురైనా
వాటిని
అధిగమిస్తూ
ముందుకు
సాగాలన్నది
ఆయన
నైజం.
టాటా
సన్స్
చైర్మన్
గా
ఉన్నంత
కాలం
ఆయన
చేసింది
కూడా
అదే.
ఈ
క్రమంలో
ప్రధాని
మోదీ
గురించి
కొన్ని
ఆసక్తికరమైన
విషయాలను
రతన్
టాటా
పంచుకున్నారు.
ప్రస్తుతం
భారత
ప్రధానిగా
ఉన్న
నరేంద్ర
మోదీతో
తనకు
పరిచయం
ఆయన
గుజరాత్
సీఎంగా
పనిచేస్తున్నప్పటి
నుంచి
ఉందని
రతన్
టాటా
తెలిపారు.
పశ్చిమ
బెంగాల్
సింగూర్
ప్రాంతంలో
ఏర్పాటు
చేసిన
టాటా
నానో
ఫ్యాక్టరీని
రైతులతో
చెలరేగిన
వివాదం
కారణంగా
తరలించాల్సిన
పరిస్థితి
ఏర్పడింది.
ఆ
సమయంలో
ఫ్యాక్టరీని
గుజరాత్
కు
మార్చేందుకు
అప్పటి
సీఎం
నరేంద్ర
మోదీని
తాను
కలిసినట్లు
టాటా
వెల్లడించారు.
ఇబ్బందికర
పరిస్థితుల్లో
తమ
కర్మాగారాన్ని
ఏర్పాటు
చేసేందుకు
ఒక
స్థలం
కోసం
ప్రయత్నాలు
చేస్తుండగా
దానికి
నరేంద్ర
మోదీ
అద్భుతమైన
పరిష్కారంతో
ముందుకొచ్చారని
వెల్లడించారు.
తనను
ఫ్యాక్టరీని
గుజరాత్
కు
తరలించేందుకు
స్వయంగా
మోదీ
ఆహ్వానించి
చర్చలు
జరిపారన్నారు.
కేవలం
మూడు
రోజుల్లో
తన
సమస్యకు
సీఎంగా
పరిష్కారాన్ని
అందించినట్లు
ఇంటర్వ్యూలో
వెల్లడించారు.
కలిగిన
మూడో
రోజునే
ఫోన్
చేసి
ఫ్యాక్టరీ
ఏర్పాటుకు
అవసరమైన
స్థలాన్ని
కేటాయిస్తున్నట్లు
మోదీ
తెలిపిన
విషయాన్ని
వెల్లడించారు.
మీకు
మాటిచ్చినట్లుగా
ఫ్యాక్టరీకి
అవసరమైన
స్థలం
సిద్ధమైంది
రతన్
జీ
అంటూ
స్వయంగా
తెలిపారని
గుర్తుచేసుకున్నారు.
ఇలాంటివి
సహజంగా
భారత్
లాంటి
దేశంలో
జరగవని
రతన్
టాటా
అభిప్రాయపడ్డారు.
English summary
Business Tycoon Ratan Tata diclosed his relationship with PM Modi at times of defficulty
Business Tycoon Ratan Tata diclosed his relationship with PM Modi at times of defficulty
Story first published: Wednesday, May 31, 2023, 14:29 [IST]
[ad_2]
Source link
Leave a Reply