RBI News: మిస్సింగ్ రూ.500 నోట్లు ఏమయ్యాయ్..? ఆర్బీఐ క్లారిటీ ఏంటంటే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

RBI
News:
భారత
ఆర్థిక
వ్యవస్థకు
అవసరమైన
కరెన్సీని
రిజర్వు
బ్యాంక్
ముద్రిస్తుంటుంది.
అయితే
సర్క్యులేషన్
లోకి
విడుదల
చేసిన
రూ.500
నోట్లు
మిస్
అయ్యాయంటూ
వచ్చిన
నివేదికను
ఆర్‌బీఐ
తిరస్కరించింది.

ప్రింటింగ్
ప్రెస్‌ల
నుంచి
ఆర్‌బీఐకి
సరఫరా
చేయబడిన
అన్ని
నోట్లు
సక్రమంగా
లెక్కించబడతాయని
రిజర్వు
బ్యాంక్
శనివారం
వెల్లడించింది.
ప్రెస్‌లలో
ముద్రించిన
నోట్లను
సరిదిద్దడానికి,
వాటిని
ఆర్‌బీఐకి
సరఫరా
చేయడానికి
బలమైన
వ్యవస్థలు
ఉన్నాయని
నొక్కి
చెప్పింది.

వ్యవస్థలలో
“నోట్ల
ఉత్పత్తి,
నిల్వ,
పంపిణీని
పర్యవేక్షించడానికి
కఠినమైన
ప్రోటోకాల్‌లు”
ఉంటాయని
స్పష్టం
చేసింది.

RBI News: మిస్సింగ్ రూ.500 నోట్లు ఏమయ్యాయ్..? ఆర్బీఐ క్లారిట


క్రమంలో
మనోరంజన్
రాయ్
అనే
సామాజిక
కార్యకర్త
సమాచార
హక్కు
చట్టం
కింద
వీటికి
సంబంధించిన
వివరాలను
కోరారు.

క్రమంలో
భారత
ఆర్థిక
వ్యవస్థ
నుంచి
రూ.88,032.5
కోట్లు
విలువైన
రూ.500
నోట్లు
మిస్
అయ్యాయంటూ
ఆరోపించారు.
దేశంలోని
మూడు
మింట్
లలో
కొత్తగా
రూపొందించిన
రూ.500
నోట్లు
8,810.65
మిలియన్
నోట్లను
ముద్రించగా..
వాటిలో
కేవలం
7,260
మిలియన్
నోట్లను
రిజర్వు
బ్యాంక్
అందుకున్నట్లు
RTI
డేటా
పేర్కొంది.
మిగిలిన
నోట్లు
వ్యవస్థ
నుంచి
ఎక్కడికి
వెళ్లాయనే
ప్రశ్నను
మనోరంజన్
లేవనెత్తారు.
ప్రస్తుతం
ఇది
దేశ
వ్యాప్తంగా
పెద్ద
చర్చకు
దారితీసింది.

నాసిక్‌లోని
కరెన్సీ
నోట్
ప్రెస్
ఏప్రిల్
2015-డిసెంబర్
2016
మధ్య
375.450
మిలియన్
కొత్త
నోట్లను
ముద్రించినట్లు
నివేదించబడింది.
కానీ
రిజర్వు
బ్యాంక్
రికార్డుల
ప్రకారం
345
మిలియన్
నోట్లను
పొందినట్లు
చూపుతున్నాయి.

నోట్లు
రఘురామ్
రాజన్
గవర్నర్‌గా
ఉన్న
సమయంలో
RBIకి
పంపిణీ
చేయబడ్డాయి.
కరెన్సీ
నోట్ల
ముద్రణ,
సరఫరాలో
సంక్లిష్టమైన
లాజిస్టికల్
సవాళ్లను
పేర్కొంటూ
RBI
నుంచి
కొంతమంది
సీనియర్
అధికారులు
అసమతుల్యతను
సమర్థించినట్లు
మింట్
కథనం
నివేదించింది.

RTI
అభ్యర్థనను
దాఖలు
చేయడంతో
పాటుగా,
కార్యకర్త
మనోరంజన్
రాయ్
సెంట్రల్
ఎకనామిక్
ఇంటెలిజెన్స్
బ్యూరో(CEIB),
ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్
(ED)కి
రూ.500
నోట్లకు
సంబంధించిన
వ్యత్యాసం
గురించి
తెలియజేసినట్లు
తెలుస్తోంది.

English summary

RBI clarifies over 500 rupees notes missing from indian economy, RTI activist fights

RBI clarifies over 500 rupees notes missing from indian economy, RTI activist fights

Story first published: Sunday, June 18, 2023, 9:45 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *