Red Rice: ఈ అన్నం తింటే.. బరువు తగ్గడంతో పాటు, గుండెకు కూడా మంచిది..!

[ad_1]

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది..

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది..

షుగర్‌ పేషెంట్స్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. కంటి సమస్యలు, కిడ్నీలు సమస్యలు, కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. రెడ్ రైస్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇది షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది.​

Bone Health: ఈ ఆసనాలు ప్రాక్టిస్‌ చేస్తే.. ఎముకలు బలంగా ఉంటాయ్..!

ఆస్తమా పేషెంట్స్‌కు మేలు చేస్తుంది..

ఆస్తమా పేషెంట్స్‌కు మేలు చేస్తుంది..

రెడ్‌రైస్‌లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది, ఇది శ్వాస విధానాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ వినియోగం, ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఆస్తమాను లక్షణాలను తగ్గించడానికి తోడ్పడుతుంది. (image source – pixabay)​

ఒకే ప్లేట్‌లో ఫుడ్‌ షేర్‌ చేసుకుని తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

ఎముకలు దృఢంగా ఉంటాయి..

ఎముకలు దృఢంగా ఉంటాయి..

రెడ్ రైస్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరమైన రెండు పోషకాలు. ఎర్రబియ్యం ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముక సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. (image source – pixabay)

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

ఎర్ర బియ్యంలో కరిగే, కరగని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి, అంటే ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. ఫైబర్ అతిసారం, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలను పరిష్కరిస్తుంది.

(image source – pixabay)

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

ఎర్ర బియ్యం మిమ్మల్ని చాలా కాలం పాటు సంతృప్తిగా ఉంచుతుంది, కాలక్రమేణా మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఎర్రబియ్యంలో కొవ్వు ఉండదు, ఇది ఆకలి బాధలను తగ్గిస్తుంది. మీరు ఆహారం ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ డైట్‌లో రెడ్‌రైస్‌ కచ్చితంగా చేర్చుకోండి.

(image source – pixabay)

గుండె సమస్యల ముప్పు తగ్గిస్తుంది..

గుండె సమస్యల ముప్పు తగ్గిస్తుంది..

ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే, వైట్ రైస్‌కు బదులుగా, రెడ్‌ రైస్‌కు మారండి. ఎర్రబియ్యం మీ డైట్‌లో చేర్చుకుంటే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మీ అందాన్ని సంరక్షిస్తుంది..

మీ అందాన్ని సంరక్షిస్తుంది..

ఎర్రబియ్యంలో ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది, చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా రక్షిస్తుంది. ఎర్రబియ్యంలో జింక్, ఐరన్, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది చర్మానికి పోషణ అందిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, మీ అందాన్ని రక్షిస్తాయి.

Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా..?

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *