Reliance: తగ్గేదేలే.. కూల్ డ్రింక్స్ నుంచి సబ్బుల వరకు.. అంబానీ ధరల యుద్ధం స్టార్ట్..!!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Reliance: ముఖేష్ అంబానీ ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా అక్కడ ముందుగా జరిగేది ధరల యుద్ధమే. అవును భారతీయ వినియోగదారుల నాడి పట్టిన రిలయన్స్ అధినేత అందుకు అనుగుణంగా ఉచితాలు, తక్కువ ధరలతో తన కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తుంటారు. అయితే ఆయన నేతృత్వంలోని రిలయన్స్ తాజాగా ఎఫ్ఎమ్సీజీ, హోమ్ కేర్ విభాగంలోకి అరంగేట్రం చేసింది.

వినియోగదారులు రోజువారీగా వినియోగించే వస్తువుల వ్యాపారంలో ప్రజలకు చేరువయ్యేందుకు అంబానీ తన ప్రైస్ వార్ స్ట్రాటజీని తిరిగి తెరమీదకు తెచ్చారు. దీంతో సబ్బుల నుంచి కూల్ డ్రింక్స్ వరకు అన్ని ఉత్పత్తులను రిలయన్స్ మార్కెట్లోని ఇతర ప్రత్యర్థి సంస్థల కంటే దాదాపు 30 నుంచి 35 శాతం తక్కువ ధరలకు అందిస్తోంది. రిలయన్స్ గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయ కంపెనీలతో పాటు విదేశీ సంస్థలు సైతం ఆందోళన చెందుతున్నాయి.

Reliance: తగ్గేదేలే.. కూల్ డ్రింక్స్ నుంచి సబ్బుల వరకు..

అంబానీ నిర్ణయం అమెరికాకు చెందిన ప్రఖ్యాత హిందుస్థాన్ యూనీలివర్, ప్రాక్టర్ గ్యాంబుల్ వంటి సంస్థలనే కాక చాలా దేశీయ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. ద్రవ్యోల్బణ సమయంలో కంపెనీలు పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలను పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండగా.. మరో పక్క ముఖేష్ అంబానీ ఉత్పత్తులను మరింత తక్కువకు అందించాలనుకోవటం లాభాలపై భారీ ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఇండిపెండెన్స్ పేరుతో కంపెనీ తన ఉత్పత్తులను తొలుత గుజరాత్ రాష్ట్రంలో రిలయన్స్ విక్రయించింది. రెండో దశలో దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్ ను అభివృద్ధి చేసి ప్రతి మారుమూర ప్రాంతానికి తమ ఉత్పత్తులను చేరువ చేయాలని కంపెనీ పెద్ద ప్రణాళికతో ముందుకు సాగుతోంది. దీనికి తోడు ఇప్పటికే కంపెనీకి దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలు, ఈ-కామర్స్ జియో మార్ట్ తో పాటు చిల్లర దుకాణాలకు సరఫరా చేసే జియో హోల్ సేల్ ఛానల్ ఉంది. ఇవి కంపెనీ వేగంగా మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు సహాయకారిగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో రూ.75 వేల కోట్ల విలువైన భారత కూడ్ డ్రింక్స్ మార్కెట్లో క్యాంపాకోలాతో పెప్పికో, కోకాకోలాకు ఎదురెళుతోంది రిలయన్స్. ఇదే క్రమంలో పర్సనల్ కేర్, ఎఫ్ఎమ్సీజీ రంగంలో రూ.1.78 లక్షల కోట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో 100 గ్రాముల.. గ్లిమ్మర్‌ బ్యూటీ సోప్స్, గెట్‌ రియల్‌ నేచురల్‌, ప్యూరిక్‌ హైజీన్‌ సబ్బులు కేవలం రూ.25కి అందిస్తూ ప్రత్యర్థి కంపెనీలకు పెద్ద పోటీని ఇస్తోంది. దీనికి తోడు వాషింగ్ మెషీన్ లిక్విడ్స్, డిష్ వాషింగ్ సోప్స్ వంటి ఇతర ఉత్పత్తులను సైతం ఆకర్షనీయమైన ధరలకు అందుబాటులోకి తెచ్చింది.

English summary

Mukesh Ambani’s Reliance started price war from Soft Drinks to Soaps in FMCG, Personal Care products

Mukesh Ambani’s Reliance started price war from Soft Drinks to Soaps in FMCG, Personal Care products

Story first published: Monday, March 27, 2023, 11:22 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *