Reliance: వామ్మో.. ఆట మెుదలెట్టిన అంబానీ కూతురు.. అల్లాడిపోతున్న ఐటీసీ, హిందుస్థాన్..

[ad_1]

సొంత బ్రాండ్లు..

సొంత బ్రాండ్లు..

కంపెనీ తన ఉత్పత్తులను ఇండిపెండెన్స్ ఫర్ సేల్ అనే కొత్త బ్రాండ్‌ పేరుతో ఎఫ్ఎమ్సీజీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. దీనికి ముందు కంపెనీ గడచిన ఏడాదిగా ఆహారం, స్నాక్స్, శీతల పానీయాలు, ఇతర రోజువారీ గృహ వినియోగ ఉత్పత్తుల్లో అనేక కంపెనీలను ఇప్పటికే కొనుగోలు చేసింది. పూర్తి స్థాయి FMCG కంపెనీ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన కంపెనీ ఇక రంగంలోకి దిగింది.

ధరల యుద్ధానికి తెర..

ధరల యుద్ధానికి తెర..

దేశంలోని అతిపెద్ద FMCG మార్కెట్ ఆదాయంపై కన్నేసిన అంబానీలు రిలయన్స్ జియో మాదిరిగానే పెనిట్రేటింగ్ స్థాటజీని వినియోగించవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ రంగంలోని కంపెనీలతో 365 రోజులూ ధరల యుద్ధం ఉంటుందని వ్యాపారాలు అంటున్నారు. అలా ప్రజలను ఆకర్షించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు.

తొలి యుద్ధక్షేత్రం గుజరాత్..

తొలి యుద్ధక్షేత్రం గుజరాత్..

INDEPENDENCE బ్రాండ్ క్రింద సరసమైన ధరలకు నూనెలు, పప్పులు, తృణధాన్యాలు, ప్యాక్ చేసిన ఆహారాలతో పాటు ఇతర ఉత్పత్తులు ఉంటాయని ఇషా అంబానీ వెల్లడించారు. అయితే తొలి దశలో రిలయన్స్ రిటైల్ ఈ ఉత్పత్తులను ముఖేష్ అంబానీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బ్రాండ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆ తర్వాత దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది.

కంపెనీల్లో గుబులు..

కంపెనీల్లో గుబులు..

దీనికి సంబంధించిన ప్రణాళికలను ఆగస్టులో జరిగిన కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించింది. రిలయన్స్ తీసుకొస్తున్న బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్, ITC ఉత్పత్తులకు మార్కెట్లో పెద్ద పోటీదారుగా నిలవనుంది. అయితే ప్రతి భారతీయుడికీ నాణ్యమైన, సరసమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్లు ఇషా అంబానీ వెల్లడించారు.

లాభాల పంట..

లాభాల పంట..

మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మెుత్తం రూ.1.99 లక్షల కోట్ల టర్నోవర్ పై రూ.7,055 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీరిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్, రిలయన్స్ కన్స్యూమర్ బ్రాండ్‌లు, 7-ELEVEN, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్ ఫుడ్‌వేర్, రిలయన్స్ జ్యువెల్, రిలయన్స్ మాల్ తో పాటు ఇప్పుడు కొత్త INDEPENDENCE బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *