[ad_1]
ఆందోళన తగ్గిస్తుంది..
ఒక కప్పు రోజ్ టీ ఆందోళనను తగ్గించడానికి, స్ట్రెస్‌ను కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుంది. గులాబీలోని పోషకాలు విశ్రాంతిని కలిగిస్తాయి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాలను శాంతపరిచి ఒత్తిడి, ఆందోళనలనూ దూరం చేస్తుంది. రోజ్ టీ వేడిగా కంటే చల్లగా రుచి ఇంకా బాగుంటుంది.
Sleeping posture: ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?
జీర్ణక్రియకు మేలు చేస్తుంది..
గులాబీ రేకులను జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఎన్నో శతాబ్దాలుగా ఉపోయోగిస్తున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. రోజ్‌టీ కాన్స్టిపేషన్కు ఔషధంలా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. (image source – pixabay)
నెలసరి నొప్పులు తగ్గిస్తుంది..
నెలసరి సమయంలో రోజ్ టీ తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తింది. రోజ్ టీ మానసిక, శారీరక పీరియడ్ లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది పెయిన్ కిల్లర్స్, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
ఒకే ప్లేట్లో ఫుడ్ షేర్ చేసుకుని తింటున్నారా..? అయితే జాగ్రత్త..!
రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది..
గులాబీ టీలో విటమిన్ ఏ, సి , పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు త్వరిత శక్తినిస్తాయి. రోగనిరోధకత శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ హెర్బల్ టీ మిమ్మల్ని అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున శరీరంలోని ఇన్ఫెక్షన్లను నయం చేసి బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. తరచూ దగ్గూ, జలుబు బారినపడకుండా చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
టాక్సిన్స్ తొలగిస్తుంది..
గులాబీ టీ శరీరంలోని వ్యర్థాలను ఈ పానీయం తొలగిస్తుంది. తద్వారా అధిక కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. గులాబీ రేకులలోని యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. క్యాన్సర్ వంటి క్షీణించిన వ్యాధులను నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
బరువు తగ్గుతారు..
గులాబీ టీలోని విటమిన్లు, ఫైబర్లు ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపుని నిండుగా ఉంచుతాయి. ఇక జంక్‌పుడ్స్, ఆయిల్‌ఫుడ్స్ తినాలనే ఆలోచనలను దూరం చేస్తాయి. వీటికి దూరంగా ఉండటం వల్ల బరువును అదుపు చేయొచ్చు. గులాబీ టీలో కెలొరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వును కరిగించి క్రమంగా బరువును తగ్గిస్తుంది.
(image source – pixabay)
ఇలా తయారు చేసుకోండి..
పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకలు వేయాలి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీరేకలు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనె, గులాబీనీరు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply