Rosemary Tea: ఈ టీ రోజు తాగితే.. షుగర్‌ తగ్గడమే కాదు, క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది..!

[ad_1]

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి..

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి..

రోజ్మేరీలో రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పారాడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి సెల్యులార్ నష్టం, వాపును తగ్గించడానికి తోడ్పడతాయి.

Kidney Stones: మీ డైట్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఈజీగా కరుగుతాయ్..!

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

రోజ్మేరీ టీ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి, బైల్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం విచ్ఛిన్నం, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు.. రోజ్మేరీ టీ తాగితే మేలు జరుగుతుంది.

(image source – pexels)

మెదడు పనితీరుకు మేలు చేస్తుంది..

మెదడు పనితీరుకు మేలు చేస్తుంది..

రోజ్మేరీ అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి.రోజ్మేరీ వాసనను పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, బ్రెయిన్‌ యాక్టివ్‌గా పనిచేస్తుంది. రోజ్‌మెరీ టీ తాగితే.. అవే ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. రోజ్మెరీలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచతాయి.

(image source – pexels)

యాంటీఇన్ఫ్లమేటరీ ప్రభావాలు..

యాంటీఇన్ఫ్లమేటరీ ప్రభావాలు..

దీర్షకాలిక ఇన్ఫ్లమేషన్‌ కారణంగా.. గుండె సమస్యలు, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. రోజ్మేరీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. వాపును తగ్గించడానికి తోడ్పడతాయి.
(image source – pexels)​

Diabetes Mistakes: ఈ 5 తప్పులు చేస్తే.. షుగర్‌ పెరుగుతుంది.. !

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

రోజ్మేరీలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజ్మేరీ టీ తాగితే.. వ్యాధికారక క్రిములతో పోరాడటానికి.. శరీర రక్షణను బలోపేతం చేస్తుంది.

(image source – pexels)

కంటికి మంచిది..

కంటికి మంచిది..

ఇన్వెస్టిగేటివ్ ఆప్తాల్మాలజీ అండ్ విజువల్ సైన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజ్మేరీలోని ఓ కెమికల్‌ మాక్యులర్ డిజెనరేషన్, ఇతర కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
(image source – pixabay)

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ (AICR) ప్రకారం, రోజ్మేరీలో కార్నోసోల్ అనే ఫైటోకెమికల్ పుష్కలంగా ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, క్యాన్సర్ సంబంధిత హార్మోన్ల ఉత్పత్తిని పరిమితం చేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

(image source – pexels)

బ్లడ్‌ షుగర్స్‌ తగ్గిస్తుంది..

బ్లడ్‌ షుగర్స్‌ తగ్గిస్తుంది..

రోజ్మేరీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు.. ప్రేగులలో చక్కెర శోషణను తగ్గిస్తాయి. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

(image source – pexels)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *