[ad_1]
గతవారం చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగి.. చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగానూ.. ఇప్పటి వరకూ ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగానూ భారత్ నిలిచింది.
‘ప్రస్తుతం చంద్రుడిపై అన్వేషణలు కొనసాగుతున్నాయి. రోవర్‌లోని లిబ్స్ దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించింది.. ఊహించినట్టుగానే అల్యూమినియం, కాల్షి యం, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్‌లను కూడా గుర్తించింది. హైడ్రోజన్ (హెచ్)కోసం అన్వేషణ కొనసాగుతోంది’ అని ట్వీట్ చేసింది.
మరోవైపు, చంద్రుడిపై రెండు వారాల పాటు పరిశోధనలు చేసేలా రూపొందించిన చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు అక్కడ ల్యాండయి ఇప్పటికే 8 రోజులు పూర్తి చేసుకున్నాయి. మరో ఆరు రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అక్కడ సూర్యాస్తమయం కానుండగా.. మరో రెండు వారాల తర్వాత కూడా ఇవి పనిచేస్తే అద్భుతమే అవుతుంది. మైనస్ డ్రిగీల ఉష్ణోగ్రతలను తట్టుకుని, మళ్లీ సూర్యోదయం అయ్యే వరకూ రోవర్, ల్యాండర్ మనుగడ సాగిస్తే.. చంద్రుడి గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇక, ఇస్రోకు ( ISRO) చెందిన ముఖ్యమైన యూనిట్లలో ఒకటైన LEOS.. ఇతర గ్రహాల పరిశోధనల మిషన్‌ల కోసం ఆటిట్యూడ్ సెన్సార్‌ల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తుంది. రిమోట్ సెన్సింగ్, వాతావరణ పేలోడ్‌ల కోసం ఆప్టికల్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. ప్రపంచ స్థాయి ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్, కోటింగ్ సౌకర్యాలను కలిగి ఉన్న ఈ యూనిట్.. త్రీ-యాక్సిస్ ఫైబర్ ఆప్టిక్స్ గైరో, ఆప్టికల్ కమ్యూనికేషన్, MEMS, నానోటెక్నాలజీ, డిటెక్టర్లు, భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల కోసం పేలోడ్‌ల అభివృద్ధి వంటి కొత్తతరం సాంకేతికతలు కూడా అనుసరిస్తోంది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply