[ad_1]
News
oi-Chekkilla Srinivas
మలేషియాలో ఇప్పుడు ఇతర కరెన్సీలతో పాటు భారత రూపాయిని ఉపయోగించవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శనివారం తెలిపింది. ఇప్పటి వరకు డాలర్లలో రూపంలో వ్యాపార లావాదేవీవు జరిగేవి.. ఇప్పుడు భారత కరెన్సీ రూపాయిల్లో కూడా లావాదేవీలు జరపొచ్చు.గత ఏడాది జూలైలో భారతీయ కరెన్సీలో అంతర్జాతీయ వాణిజ్యం సెటిల్‌మెంట్‌కు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయం తీసుకుంది.
“భారతదేశం, మలేషియా మధ్య వాణిజ్యం ఇప్పుడు ఇతర కరెన్సీలలో ప్రస్తుత సెటిల్మెంట్ తో పాటు భారత రూపాయి (INR)లో చేసుకోవచ్చు” అని MEA తెలిపింది. వాణిజ్య వృద్ధిని సులభతరం చేయడం. భారత రూపాయిలో గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీ ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడం RBI లక్ష్యమని విదేశఇ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
కౌలాలంపూర్‌లో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా (IIBM), భారతదేశంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన దాని సంబంధిత బ్యాంక్ ద్వారా ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాను తెరవడం ద్వారా ఈ లావాదేవీలు జరపొచ్చు. దేశీయ కరెన్సీలో చెల్లింపులు చేయడానికి Vostro ఖాతాలు ఉపయోగిస్తారు.
English summary
Indian Rupeee can use in malaysia for trade
The Ministry of External Affairs (MEA) said on Saturday that the Indian rupee can now be used in Malaysia along with other currencies.
Story first published: Saturday, April 1, 2023, 13:45 [IST]
[ad_2]
Source link
Leave a Reply