Sleeping posture: ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1]

గుండెకు మంచిది..

గుండెకు మంచిది..

ఎడమవైపు నిద్రపోతే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో గుండె ఎడమ వైపుకి ఉంటుంది. మనం ఎడమవైపు తిరిగి పడుకుంటే.. గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.​

Red Rice: ఈ అన్నం తింటే.. బరువు తగ్గడంతో పాటు, గుండెకు కూడా మంచిది..!

ఆయాసం ఉండదు..

ఆయాసం ఉండదు..

ఒక్కోసారి మనం అతిగా తింటూ ఉంటాం, దీనివల్ల ఆయాసం వస్తూ ఉంటుంది. మీకు ఆయాసంగా ఉన్నప్పుడు ఎడమవైపు తిరిగి పడుకుంటే.. కొంత ఉపశమనం లభిస్తుంది. ఇలా పడుకుంటే.. జీర్ణవ్యవస్థలోని పాంక్రియాటిక్‌ ఎంజైమ్స్‌ సమర్థంగా పనిచేసి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఆయాసం తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది..

జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది..

ఎడమవైపు తిరిగి పడుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సెకమ్‌లోకి చేరుతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆపై ఇవి క్రమంగా మన శరీరానికి ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వెళ్తాయి. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు.. గురత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందికి వెళ్లిపోతాయి. ఇలా ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికు వెళ్తాయి. ఇలా పెద్ద పేగు క్లీన్‌ అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

ఒకే ప్లేట్‌లో ఫుడ్‌ షేర్‌ చేసుకుని తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

రక్త సరఫరా మెరుగుపడుతుంది..

రక్త సరఫరా మెరుగుపడుతుంది..

మన శరీరంలోని లింఫ్ వ్యవస్థలో స్ల్పీన్ పెద్ద అవయవం. ఇది కూడా శరీరంలో ఎడమ వైపు ఉంటుంది. మనం ఎడమవైపు తిరిగి పడుకుంటే.. లింఫ్ చురుకుగా పని చేస్తుంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది.

Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా..?

గర్భిణులకు మంచిది..

గర్భిణులకు మంచిది..

ఎడమవైపు తిరిగి పడుకుంటే.. గర్భిణులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా చక్కగా నిద్ర పడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా కడుపులో ఎదిగే బిడ్డకు పోషకాలు సులభంగా అందుతాయి. ఇలా పడుకున్నప్పుడు.. కాళ్లు కాస్త ముడుచుకొని.. కాళ్ల మధ్యలో చిన్న దిండు పెట్టుకుంటే పొట్టపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *