Small Cap Mutual Funds: అధిక రాబడి అందించిన 8 స్మాల్ క్యాప్ ఫండ్లు ఇవే..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో గత ఏడాదిగా పెట్టుబడిదారులు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లకు దూరంగా ఉంటున్నారు. స్మాల్ క్యాప్ కేటగిరీ గత సంవత్సరం 2.19 శాతం రాబడి అందించింది. అయితే ప్రస్తుతం, స్వల్పకాలిక పరిస్థితుల కారణంగా స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టబుడి నిర్ణయం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాల్లో ఎనిమిది స్మాల్ క్యాప్ ఫండ్లు 40 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి.

మూడేళ్లుగా మార్కెట్‌లో 21 స్మాల్ క్యాప్ పథకాలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది స్మాల్ క్యాప్ పథకాలు 40% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ కేటగిరీలో అగ్రగామిగా ఉంది. సవాలు మార్కెట్, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన 63.44% రాబడిని అందించింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రెండో స్థానంలో ఉంది. ఈ ఫండ్ మూడేళ్లలో 46 శాతం రాబడి ఇచ్చింది.

Small Cap Mutual Funds: అధిక రాబడి అందించిన 8 స్మాల్ క్యాప్

HSBC స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లల్లో 42.94 శాతం, కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 42.75 శాతం, HDFC స్మాల్ క్యాప్ ఫండ్ 41.77,టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 40.91, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.85, ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.05 శాతం రాబడి అందించాయి.స్మాల్ క్యాప్ ఫండ్లు చాలా చిన్న కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం, ఈ పథకాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 250 కంటే తక్కువ ర్యాంక్ ఉన్న స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి.

ఈ స్టాక్‌లు పెట్టుబడిదారులకు మంచి రాబడి అందించగలవు. ఫండ్ మేనేజర్ గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న కంపెనీని గుర్తించడంలో విజయవంతమైతే, అది చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. స్మాల్ క్యాప్ నుంచి డబ్బు సంపాదించడం అంత సులభం కాదు. ఈ పథకాలు చాలా అస్థిరంగా ఉంటాయి. ప్రతికూల రాబడిని కూడా అందిస్తాయి. స్మాల్ క్యాప్ ఫండ్లలో 10 సంవత్సరాలు సుదీర్ఘ పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచించాలు. అలా అయితేనే రాబడి వస్తుందని చెబుతున్నారు.

Note: ఈ వార్త మా సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.

English summary

Best 8 small cap mutual funds in last 3 years

Currently Indian stock markets are facing ups and downs. Due to this, investors have been staying away from small cap mutual funds for the past year.

Story first published: Saturday, March 25, 2023, 15:55 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *