Small Cap Mutual Funds: మూడు సంవత్సరాల్లో అత్యుత్తమ రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్…

[ad_1]

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్

CRISIL, వాల్యూ రీసెర్చ్ రెండు రేటింగ్ ఏజెన్సీలు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 50.3% వార్షిక రాబడిని, అదే కాలంలో 99.41% సంపూర్ణ రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఐటీసీ, ఆర్‌బిఎల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జిందాల్ స్టెయిన్‌లెస్, ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్‌ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది.

రూ. 10,000

రూ. 10,000

మీరు ఈ ఫండ్ లో నెలవారీగా రూ. 10,000ను SIPగా ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని మొత్తంగా రూ. 3,60,000 కడతారు. అంటే 51.1% వార్షిక రాబడితో 3 సంవత్సరాలలో రూ. 7,58.022గా మారి ఉండేది. మీరు ఫండ్ లో SIP పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ. 1,000తో ఈ ఫండ్‌లో ప్రారంభించాల్సి ఉంటుంది.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

ఇది 3 సంవత్సరాలలో 2వ అత్యధిక SIP రిటర్న్స్‌తో జాబితాలో ఉన్న మరొక స్మాల్ క్యాప్ ఫండ్. ఫండ్ 3 సంవత్సరాల SIPలో 35% వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ లో రూ. 10,000 నెలవారీ SIP చేస్తే 3 సంవత్సరాలలో రూ. 6,29,394 అయి ఉండేది. ఈ ఫండ్ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెపిఐటి టెక్నాలజీస్ మరియు బజాజ్ ఎలక్ట్రానిక్స్‌తో సహా టాప్ హోల్డింగ్‌తో ఈక్విటీలో 96.5% పెట్టుబడులను కలిగి ఉంది.

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 3 సంవత్సరాల SIPలో అత్యధిక రాబడితో ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది. 3 సంవత్సరాల SIPలో, ఫండ్ 32.94% వార్షిక రాబడిని ఇచ్చింది. అదే సమయంలో ఇది 59.92% సంపూర్ణ రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్‌లోనెలవారీ రూ. 10,000 SIPతో 3 సంవత్సరాలలో పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ. 6,24,011గా మారి ఉండేది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *