[ad_1]
అనేక సమస్యలకి ఔషధంలా..
లక్ష్మణ ఫలంలో అద్భుత గుణాలు ఉన్నాయి. కాబట్టి, దీనిని అనేక ఆరోగ్య సమస్యలకి ట్రీట్‌మెంట్‌లా వాడతారు. ఈ పండులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరగుతుంది. చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా ఇందులోని ఫైటో స్టెరాల్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడతాయి.(Image source – pixabay)
చిగుళ్ళ వ్యాధి దూరం..
యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉన్న ఈ లక్ష్మణ ఫలం క్యావిటిస్, చిగుళ్ళ వ్యాధి కారణమయ్యే బ్యాక్టీరియా సహా, వివిధ రకాల బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. అదే విధంగా, ఈ పండు సారం స్టెఫిలోకాకస్ జెర్మ్స్, కలరాకి వ్యతిరేకంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై పరిశోధన మరికొంత జరగాల్సి ఉంది.
Also Read : Heart Attack : గుండెపోటు వచ్చినప్పుడు ఈ టైమ్‌లోపు హాస్పిటల్‌కి వెళ్తే ప్రమాదం లేదు..
క్యాన్సర్స్ దూరం..
ఓ పరిశోధన ప్రకారం. లక్ష్మణ ఫలంలో యాంటీ కాన్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, క్యాన్సర్ నివారణ, ట్రీట్‌మెంట్‌లో ఈ పండు బాగా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. బ్రెస్ట్ క్యాన్సర్ కణుతులు, క్యాన్సర్ కణాలను దూరం చేస్తుంది. అదే విధంగా.. లుకేమియా కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి, ఈ పండుని క్యాన్సర్స్ పేషెంట్స్‌కి దివ్యౌషధమని చెప్పొచ్చు.
Also Read : Hug Day : హగ్ చేసుకుంటే బీపి కంట్రోల్ అవుతుందా..
మలబద్ధకం దూరం..
ఈ లక్ష్మణ డులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణ సమస్యలు తగ్గడానికి హహ్యాపీగా దీనిని తినొచ్చు. దీనిని తినడం వల్ల ప్రేగు కదలికలు సరిగ్గా ఉండి మలబద్ధకం దూరమవుతుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
బరువు తగ్గడం..
అదే విధంగా, లక్ష్మణఫలం రెగ్యులర్‌గా తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి, బరువు తగ్గేవారికి ఇది గొప్ప పండుగా చెప్పొచ్చు. రెగ్యులర్‌గా ఈ పండు తింటే త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
అందుకే వీటిని విదేశాల్లో స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, ఇలా ప్రతి పదార్థాల్లోనూ వాడతారు.
ఆర్థరైటిస్..
కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ లక్ష్మణ పండు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే వాపుని తగ్గిస్తాయి. ఇప్పటికే జంతువులపై జరుగుతున్న అధ్యయనాలు.. ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఈ పండు బాగా పనిచేస్తుందని చెబుతున్నాయి. దీనిని అంచనా వేసేందుకు మరింత పరిశోధన అవసరం..
Also Read : Antibiotics : యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా.. వీటిని మరిచిపోవద్దు..
రక్తంలో షుగర్ లెవల్స్..
ఈ పండు తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని తెలుస్తోంది. కాబట్టి.. షుగర్ ఉన్నవారు మంచి హెల్దీ లైఫ్‌స్టైల్‌లో భాగంగా.. ఈ పండుని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. కొన్ని అధ్యయనాలు ఈ విషయాలను తెలియజేశాయి. అయితే, ఇప్పటి వరకూ జరిగినవన్నీ కూడా జంతువులపై జరిగినవి మాత్రమే. మనుషులపై ఈ ప్రభావాలు ఉంటాయో లేదా అని తెలుసుకోవడానికి పరిశోధన అవసరం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply