Stock Market: ఈవారం మార్కెట్ ఇన్వెస్టర్లను ధనవంతులను చేస్తుందా..? నిపుణులు మాట..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Market
Next
Week:

గడచిన
వారంలో
దేశీయ
స్టాక్
మార్కెట్లు
భారీ
ర్యాలీని
నమోదు
చేశాయి.
దీంతో
నిఫ్టీ,
సెన్సెక్స్
సూచీలు
సరికొత్త
రికార్డు
గరిష్ఠాలకు
చేరుకున్నాయి.
అయితే
ఇప్పుడు
రానున్న
వారం
పరిస్థిపై
ఇన్వెస్టర్లు
ఆందోళన
చెందుతున్నారు.

కంపెనీల
త్రైమాసిక
ఫలితాలు,
గ్లోబల్
ట్రెండ్,
విదేశీ
పెట్టుబడుల
ప్రవాహం
వంటి
అంశాలు

వారం
స్టాక్
మార్కెట్ల
దిశా
నిర్దేశం
చేయనున్నాయి.
ప్రస్తుతం
స్థానిక
స్టాక్
మార్కెట్
రికార్డు
స్థాయిల
దగ్గర
ట్రేడింగ్
కొనసాగిస్తున్నాయి.
రూపాయి
మారకపు
విలువ,
బ్రెంట్
క్రూడాయిల్
ధరలపై
కూడా
ఇన్వెస్టర్లు

కన్నేసి
ఉంచుతారని
మార్కెట్
నిపుణులు
సూచిస్తున్నారు.

Stock Market: ఈవారం మార్కెట్ ఇన్వెస్టర్లను ధనవంతులను చేస్తుం

గ్లోబల్
మార్కెట్ల
దిశ,
రూపాయి-డాలర్
మారకం
రేటు,
ముడి
చమురు
ధరలలో
అస్థిరత
మొత్తం
మార్కెట్
ట్రెండ్‌పై
ప్రభావం
చూపుతాయని
స్వస్తిక
ఇన్వెస్ట్‌మార్ట్
సీనియర్
టెక్నికల్
అనలిస్ట్
ప్రవేశ్
గౌర్
అభిప్రాయపడ్డారు.
దేశీయ
పరిణామాలతో
పాటు
మార్కెట్‌ను
గైడ్
చేయడంలో

అంశాలు
కూడా
ముఖ్యపాత్ర
పోషిస్తాయని..
సంస్థాగత
కార్యకలాపాలు
కూడా
మార్కెట్‌పై
ప్రభావం
చూపుతాయని
చెప్పారు.

రానున్న
వారంలో
సెంట్రల్
బ్యాంక్
ఆఫ్
ఇండియా,
హెచ్‌డిఎఫ్‌సి
బ్యాంక్,
ఇండస్‌ఇండ్
బ్యాంక్,
హిందుస్తాన్
యూనిలీవర్,
ఇన్ఫోసిస్,
అశోక్
లేలాండ్,
డిఎల్‌ఎఫ్,
జెఎస్‌డబ్ల్యు
స్టీల్,
హిందుస్థాన్
జింక్,
రిలయన్స్
ఇండస్ట్రీస్
త్రైమాసిక
ఫలితాలు
విడుదల
కానున్నాయి.
చాలా
మంది
ఇన్వెస్టర్లు
వీటి
కోసం
ఇప్పటికే
ఎదురుచూస్తున్నారు.
వీటికి
తోడు
గ్లోబల్
ఫ్రంట్‌లో
చైనా
సోమవారం
ఏప్రిల్-జూన్
త్రైమాసిక
ఆర్థిక
వృద్ధి
గణాంకాలను
విడుదల
చేయటం
చాలా
కీలక
పరిణామంగా
ఉంది.

ప్రస్తుతం
విదేశీ
పోర్ట్‌ఫోలియో
ఇన్వెస్టర్లు
భారతీయ
మార్కెట్‌లో
కొనుగోలుదారులుగా
కొనసాగుతున్నారని
జియోజిత్
ఫైనాన్షియల్
సర్వీసెస్
చీఫ్
ఇన్వెస్ట్‌మెంట్
స్ట్రాటజిస్ట్
వీకే
విజయకుమార్
వెల్లడించారు.
FPIలు
ఫైనాన్షియల్,
ఆటో,
క్యాపిటల్
గూడ్స్,
రియల్టీ,
ఎఫ్‌ఎంసీజీ
స్టాక్‌లలో
పెట్టుబడులు
పెట్టడం
కొనసాగిస్తున్నాయి.
ఎఫ్‌పీఐ
కొనుగోళ్లు
సెన్సెక్స్‌,
నిఫ్టీలు
రికార్డు
స్థాయికి
చేరుకోవడంలో
దోహదపడ్డాయని
మార్కెట్
నిపుణులు
చెబుతున్నారు.

English summary

know what experts openion over indian stock markets movement in next week, is rally continues

know what experts openion over indian stock markets movement in next week, is rally continues

Story first published: Sunday, July 16, 2023, 11:44 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *