[ad_1]
మార్కెట్ సూచీలు..
ఈరోజు బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 449 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 147 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 429 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 467 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించాయి.
నోమురా సంచలన రిపోర్ట్..
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు కొనసాగుతున్న తరుణంలో చాలా దేశాల మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వాటి ఆర్థిక పరిస్థితులు ఊహించిన దాని కంటే నెమ్మదించాయి. అయితే ఈ ప్రభావం ఆసియాలోని భారత్ పై కూడా పడుతుందని రేటింగ్ ఏజెన్సీ నోమురా వెల్లడించింది. దీనివల్ల రానున్న రెండు సంవత్సరాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ పేలవమైన వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.
టాప్ గెయినర్స్..
NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, యూపీఎల్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, మారుతీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, విప్రో, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
టాప్ లూజర్స..
సూచీలోని బ్రిటానియా, పవర్ గ్రిడ్, సిప్లా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
[ad_2]
Source link
Leave a Reply