[ad_1]
నేడు సూచీలు..
మార్కెట్లు ముగింపు సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 293 పాయింట్లను కోల్పోయింది. మరో కీలక సూచీ నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోగా.. బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయాయి. అయితే అనూహ్యంగా మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ మాత్రం 158 పాయింట్ల లాభంతో 2022 ట్రేడింగ్ సంవత్సరాన్ని ముగించాయి. ఈ సమయంలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, మెటల్ కంపెనీల షేర్లు మాత్రం మంచి పనితీరును కనబరిచాయి.
చివరి క్షణాల్లో..
డిసెంబర్ మాసంలో చివరి వారాన్ని గమనించినట్లయితే.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఏకంగా 1.6 శాతం మేర లాభపడ్డాయి. అస్థిరత మధ్య 2022 క్యాలెండర్ సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున ప్రతికూల నోట్‌తో ముగిశాయి. ఈ ఏడాది బెంచ్‌మార్క్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతానికి పైగా లాభపడ్డాయి. అయితే డిసెంబర్ మాసంలో మాత్రం 3.5 శాతం క్షీణించాయి.
2022 ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్లు 2022 జనవరి మాసంలో కరోనా తర్వాత లాభాలతో సానుకూలంగా ప్రారంభించాయి. అదే సమయంలో మిడ్-సెషన్‌లో ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. క్యాలెండర్ సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున మార్కెట్లు లాభాల స్వీకరణకు గురై దాదాపు అర శాతం నష్టపోయాయి.
టాప్ గెయినర్స్..
చివరి ట్రేడింగ్ రోజు నిఫ్టీ సూచీలోని బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, టైటాన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కొ, టాటా మోటార్స్, విప్రో, హీరో మోటార్స్, ఎస్బీఐఎన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా చివరి రోజు ముగిశాయి.
టాప్ లూజర్స్..
చివరి రోజు ఎన్ఎస్ఈ సూచీలో ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు మాత్రం చివరి రోజు టాప్ లూజర్స్ గా నిలిచాయి.
[ad_2]
Source link
Leave a Reply