Success Story: ఇంటి వద్దకే డీజిల్ డెలివరీ.. అదనపు ఖర్చు లేకుండా పక్కా ఆన్‌టైమ్..

[ad_1]

 ప్లాంట్ల నుంచి నేరుగా..

ప్లాంట్ల నుంచి నేరుగా..

కల్తీని అరికట్టడం, కొలతల్లో నిక్కచ్చిగా ఉండటం, సమయానికి కస్టమర్లకు సేవలు అందించటం అనే నిబంధనలకు Anytime Diesel కట్టుబడి ఉంది. దేశంలో ఇలాంటి వ్యాపార ఆలోచనతో ముందుగా తెలుగు యువత సంచలనంగా మారారు. ఇందుకోసం ప్రత్యేకమైన వాహనాలను కంపెనీ రూపొందించుకుంది. నేరుగా HPCL, IOC, BPCL వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలతో కలిసి వ్యాపారాన్ని ముందుకు సాగిస్తోంది. ఆయిల్ కంపెనీల రిఫైనరీల నుంచి నేరుగా కస్టమర్లకు డీజిల్ సరఫరా చేస్తోంది.

అదనపు ఖర్చు లేకుండా..

అదనపు ఖర్చు లేకుండా..

యాప్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో సంప్రదించే కస్టమర్లకు ఎలాంటి అదనపు డెలివరీ ఛార్జీలు లేకుండా కంపెనీ మార్కెట్ ధరకే డీజిల్ సరఫరా చేస్తోంది. ఈ వ్యాపారాన్ని రాహుల్ రెడ్డి ప్రారంభించగా.. సహ వ్యవస్థాపకుడు, డైరెక్టరుగా వై. ప్రశాంత్ రెడ్డి కొనసాగుతున్నారు. వీరు రోజులో 24 గంటల పాటు ఈ సేవలను అందుబాటులో ఉండేలా దీనిని రూపొందించారు. ప్రధానంగా ఎక్కువ డీజిల్ వినియోగించే బల్క్ యూజర్లను తమ వ్యాపారం టార్గెట్ చేసుకుని సేవలను అందిస్తోందని వారు చెబుతున్నారు.

 వినియోగదారులకు లాభం..

వినియోగదారులకు లాభం..

డీజిల్ బంకుల వద్ద వేచి ఉండటం, అక్కడి దాకా ప్రయాణించటం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, ఇంధన వృధాను నివారించాలనే ఆలోచననుంచి Anytime Diesel పుట్టింది. ఇది తమ వినియోగదారులకు సైతం ఖర్చులను తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ భారీ యంత్రాల సరఫరాదారులు, నిర్మాణాలు, పరిశ్రమలు & ఫ్యాక్టరీలు, టెక్ పార్కులు, షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్ సెంటర్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీలు, వ్యవసాయం, రవాణా & లాజిస్టిక్స్ రంగాల్లో వ్యాపారాలకు తమ సేవలతో పరిష్కారాలను అందిస్తోంది.

కంపెనీ ప్రయాణం..

కంపెనీ ప్రయాణం..

ప్రస్తుతం కంపెనీ దేశంలోని కొన్ని నగరాల్లో తమ సేవలను అందిస్తోంది. కంపెనీకి పోటీగా ఫ్యూయల్ బడ్డీ, బుక్ మై ఫ్యూయల్, ఫ్యూయల్ ఎట్ కాల్ వంటి ఇతర సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. వ్యాపారాన్ని ప్రారంభించిన కొన్ని ఏళ్లలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ ప్రస్తుతం దాదాపు ఏడాదికి రూ.130 కోట్ల టర్నోవర్ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంది. పైగా ట్యాంపర్ ప్రూఫ్ ట్రక్కుల్లో, జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో ఒక్క చుక్క కూడా వృధా కాకుండా డీజిల్ డెలివరీలో కంపెనీ దేశంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది.

వైజాగ్ నగరంలో..

ఇటీవల్ ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్- 2023లో కంపెనీ ప్రతినిధి వై. ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. లాజిస్టిక్స్ అండ్ ఫిషింగ్ కేంద్రంగా ఉన్న విశాఖ నగరంలోని అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. కస్టమర్లకు నమ్మకమైన సేవలు, క్వాలిటీ & క్వాంటిటీ విషయంలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగటమే తమ విజయానికి కారణని కంపెనీ వ్యవస్థాపకులు చెబుతున్నారు. విదేశాల్లోని నూతన సాంకేతికతలను వినియోగించుకుని త్వరలోనే చిన్న కస్టమర్లకు సైతం సేవలను చేరువచేస్తామని వారు చెబుతున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *