SVB Crisis: అమెరికా బ్యాంక్ దివాలా..! లక్ష మంది ఉద్యోగుల ఆందోళన..పూర్తి వివరాలు..

[ad_1]

సిలికాన్ వ్యాలీ బ్యాంక్..

సిలికాన్ వ్యాలీ బ్యాంక్..

అమెరికాలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఉంది. ఇది ఎక్కువగా స్టార్టప్ కంపెనీలతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం లిక్విడిటీ క్రంచ్ కారణంగా బ్యాంక్ వద్ద తగినన్ని నిధులు లేవని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో బ్యాంక్ షేర్లు దాదాపు 85 శాతం వరకు కుప్పకూలాయి. ఈ చర్య వల్ల అమెరికాల్లోని 1000 కంటే ఎక్కువ స్టార్టప్ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు లక్ష మంది అద్యోగులకు చిక్కులు వచ్చిపడ్డాయని తెలుస్తోంది.

ఉద్యోగులకు ఇబ్బంది..

ఉద్యోగులకు ఇబ్బంది..

సాధారణంగా అందరూ పనిచేసేది నెలాఖరున అందే జీతం కోసం. అయితే ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పరిస్థితి కారణంగా ఈసారి స్టార్టప్ కంపెనీల్లో పనిచేస్తున్న లక్ష మంది ఉద్యోగులకు జీతం లభించకపోవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా.. మీరు అమెరికాలో రిజిస్టర్ చేయబడిన టెక్ కంపెనీలో పని చేస్తే, ఇది ఎక్కువగా జరిగే అవకాశం మీకు అధికంగా ఉంది. ఎందుకంటే సిలికాన్ వ్యాలీలోనే దాదాపు 25 శాతం మార్కెట్‌ను సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కలిగి ఉండటమే దీనికి కారణం.

చిక్కుకున్న నిధులు..

చిక్కుకున్న నిధులు..

ప్రస్తుతం బ్యాంక్ దివాలా తీసే స్థితికి వచ్చినందున దాదాపు 175 బిలియన్ డాలర్ల విలువైన స్టార్టప్‌ సంస్థల సొమ్ము చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన కస్టమర్ల డిపాజిట్ల ఆధారంగా బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.

ఇవి సురక్షితమైన పెట్టుబడులు అయినప్పటికీ.. స్థిరంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న కారణంగా, డిపాజిట్లు తగ్గిపోవడంతో పెట్టుబడి బాండ్లను ముందస్తుగా విక్రయించడం వల్ల స్టార్టప్‌లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఫలితంగా SVB షేర్లు 85 శాతం వరకు ప్రభావితమయ్యాయి.

ఇండియాపై ప్రభావం ఏమిటి..?

ఇండియాపై ప్రభావం ఏమిటి..?

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలటం వల్ల భారతదేశంలోని బ్యాంకింగ్ రంగంపై పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలోని స్టార్టప్ కంపెనీలకు ఈ హీట్ తగలవచ్చని తెలుస్తోంది. ఈ వార్త భారత సిలికాన్ వ్యాలీగా మారిన బెంగళూరులోని స్టార్టప్ కంపెనీలను ఒక్కసారిగా కుదుపుకు గురిచేసింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దాదాపు 2003 నుంచి ఇండియాలో SVB ఇండియా ఫైనాన్స్ ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో దాదాపు 20కి పైగా స్టార్టప్ కంపెనీలను పరియచం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో కాంట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఐసర్టిస్‌లో SVB 150 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *