Swiggy: ఖర్చులు తగ్గించుకునే పనిలో స్విగ్గీ.. ఆ వ్యాపారాన్ని అమ్మేస్తోంది..

[ad_1]

స్విగ్గీ నిర్ణయం..

స్విగ్గీ నిర్ణయం..

ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న స్విగ్గీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన వెంచర్ ఫండింగ్ మార్కెట్‌లో ఖర్చులను హేతుబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా 380 మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఖర్చుల కోతకు కొత్త ప్లాన్ వేసింది. తాజా నిర్ణయం ప్రకారం కంపెనీ తన క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని Kitchens@ కు విక్రయించింది. షేర్ల మార్పిడి పద్ధతిలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

కంపెనీ సీఈవో..

కంపెనీ సీఈవో..

కంపెనీ తన వ్యాపార వర్టికల్స్‌లో కొన్నింటిని కఠినంగా పరిశీలిస్తోందని Swiggy సహ-వ్యవస్థాపకుడు, CEO శ్రీహర్ష మెజెటీ జనవరిలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో వెల్లడించారు. ఆ సమయంలో కంపెనీకి చెందిన మాంసం మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. తమ అంచనాల ప్రకారం ఫుడ్ డెలివరీ వృద్ధి రేటు మందగించిందని వెల్లడించారు. లాభదాయకత లక్ష్యాలను చేరుకోవడానికి పరోక్ష ఖర్చులను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

క్లౌడ్ కిచెన్ వ్యాపారం..

క్లౌడ్ కిచెన్ వ్యాపారం..

స్విగ్గీ తన క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని 2017లో ప్రారంభించింది. ఉదారహణకు ఏదైనా ఒక ప్రాంతంలో బిర్యానీ అందుబాటులో లేదనుకున్నట్లయితే.. స్విగ్గీ దీనిని పూడ్చేందుకు ప్రముఖ బిర్యానీ బ్రాండ్ ను తమ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని వినియోగించుని క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తుంది. ఈ విధంగా కస్టమర్ల అభిరుచులను గౌరవిస్తూ.. వారు మెచ్చిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచేలా చేసేందుకు ఈ తరహా కిచెన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

14 నగరాల్లో..

14 నగరాల్లో..

దేశంలోని 14 నగరాల్లో క్లౌడ్ కిచెన్ లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ 2019 నాటికి దాదాపు రూ.175 కోట్లను వెచ్చించింది. దీని ద్వారా దేశంలో మెుత్తం 1000 కిచెన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత వీటిని మార్చి 2020 నాటికి మరో 12 నగరాలకు విస్తరించాలనే ఆలోచనతో మరో రూ.75 కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించింది. అయితే కరోనా తర్వాత వ్యాపార నిర్వహణలో పరిస్థితులు పూర్తిగా మారిపోవటంతో కంపెనీ ఈ విభాగాన్ని ప్రస్తుతం అమ్మేయాలని నిర్ణయించింది.

ఐపీవో ప్రయత్నం..

ఐపీవో ప్రయత్నం..

జొమాటో తర్వాత తాను సైతం ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవ్వాలని స్విగ్గీ నిర్ణయించింది. ఇందుకోసం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లను సైతం నియమించుకుంది. ఈ మార్గంలో మార్కెట్ల నుంచి ఒక బిలియన్ డాలర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది వాస్తవరూపం దాల్చలేదు ఎందుకంటే ఆ సమయంలో మార్కెట్లోకి వచ్చిన పేటీఎం, జొమాటో, నైకా, డెలివరీ వంటి స్టార్టప్ కంపెనీల ఐపీవోలు చతికిల పడటంతో వెనకడుగు వేసింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *