Tata Group: దేశం కోసం టాటాల సంచలన నిర్ణయం.. కొత్త యుగంలో కొత్త వ్యాపారం..

[ad_1]

టాటాల నిర్ణయం..

టాటాల నిర్ణయం..

వ్యాపారం అనేది ప్రస్తుత గ్లోబలైజేషన్ కాలంలో విస్తరించింది. దీనివల్ల దేశాల మధ్య ఒకరిపై మరొకరు ఆధారపడటం అనివార్యంగా మారింది. అయితే కొన్నిసార్లు ఏర్పడుతున్న సమస్యల కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవును ఇదంతా చిప్ తయారీలో ఏర్పడిన కొరత కారణంగా ప్రపంచ దేశాల్లోని వ్యాపారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. అయితే దీనిని పరిష్కరించేందుకు టాటాలు రంగంలోనికి దిగనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కొత్త యుగంలో..

కొత్త యుగంలో..

టాటా గ్రూప్ ఇప్పటికే చిప్ తయారీ కోసం ఒక ఎంటిటీని సెటప్ చేసింది. టాటా ఎలక్ట్రానిక్స్ కింద సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ఏర్పాటు చేయనున్నట్లు నిక్కీ ఆసియా ఇంటర్వ్యూలో చంద్రశేఖరన్ వెల్లడించారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ ఉన్నందున సెమీకండక్టర్లకు భారీగా డిమాండ్ పెరగనుంది. దీనిని అందిపుచ్చుకునేందుకు, కరోనా వల్ల ఈ రంగంలో ఏర్పడిన అవాంతరాలను పూడ్చి దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కీలక భూమిక పోషించేందుకు టాటాలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా సమస్యలు..

కరోనా సమస్యలు..

సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న టాటాలు సెమీకండక్టర్ ఉత్పత్తిలోకి ప్రవేశించాలనే నిర్ణయం కరోనా సృష్టించిన ఉత్పత్తి అంతరాయాలు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ప్రస్తుతం చిప్ తయారీ కోసం సంస్థ అనేక కంపెనీలతో చర్చలు జరుపుతోందని చంద్రశేఖరన్ వెల్లడించారు. అనుభవం లేని కంపెనీ సొంతంగా చిప్‌మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సవాలుగా పరిగణించబడుతుంది. అందుకే ఇప్పటికే ఉన్న చిప్ తయారీదారులతో భాగస్వామ్య అవకాశాలను టాటాలు అందిపుచ్చుకుంటున్నారు.

చైనాకు ప్రత్యామ్నాయంగా..

చైనాకు ప్రత్యామ్నాయంగా..

సెమీకండక్టర్ల తయారీ రంగంలో చాలా కీలకంగా అనేక తైవాన్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఇవి చైనా కేంద్రంగా ఉత్పత్తిని తయారు చేసేవి. అయితే కరోనా తర్వాత అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తైవాన్-చైనా మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, చైనాపై ఆధారపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సరఫరా సమస్యలతో కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ కారణంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటాలు సైతం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. దీనికి ముందు భారత వ్యాపార దిగ్గజం అయిన వేదాంతా గ్రూప్ కూడా ఇదే వ్యాపారంలోకి అరంగేట్రం చేసింది. గుజరాత్ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *