Tax: భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

2023-2023 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం పెరిగి రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శనివారం వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను మాప్-అప్‌లో పెరుగుదల నమోదు అయింది.

స్థూల వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్స్ చేశారు. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన రీఫండ్‌ల కంటే 59.44 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, రీఫండ్‌ల నికరం రూ. 13.73 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 16.78 శాతం ఎక్కువ.

Tax: భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..

ఈ వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాలలో 96.67 శాతం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల మొత్తం సవరించిన అంచనాలలో 83.19 శాతం అని CBDT ఒక ప్రకటనలో తెలిపింది. రీఫండ్‌ల సర్దుబాటు తర్వాత, CIT (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, STT (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్) సహా PIT (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లలో 20.06 శాతంగా ఉంది.

English summary

Direct Tax Collection were Increased by 16.78%

Direct tax collections for the fiscal year 2023-2023 increased by 16.78 percent to Rs. 13.73 lakh crore, the Central Board of Direct Taxes (CBDT) disclosed on Saturday.

Story first published: Saturday, March 11, 2023, 15:13 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *