[ad_1]
News
oi-Mamidi Ayyappa
TCS
News:
దేశీయ
ఐటీ
దిగ్గజం
టీసీఎస్
వరకుసగా
ఉద్యోగులకు
శుభవార్తలను
ప్రకటిస్తోంది.
కొన్ని
రోజుల
కిందట
నాలుగో
త్రైమాసిక
ఫలితాలను
విడుదల
చేసిన
కంపెనీ
తాజాగా
ఉద్యోగుల
జీతభత్యాలపై
దృష్టి
సారించింది.
వివరాల్లోకి
వెళితే
కంపెనీలోని
ఉద్యోగుల్లో
జీతాల
విషయంలో
ఉన్న
దూరాన్ని
తగ్గించేందుకు
చర్యలు
చేపట్టినట్లు
ఐటీ
దిగ్గజం
టీసీఎస్
వెల్లడించింది.
ఈ
క్రమంలో
ఉద్యోగుల
జీతాలను
రెండింతలు
చేసేందుకు
కార్యాచరణను
రూపొందించినట్లు
టీసీఎస్
చీఫ్
హ్యూమన్
రిసోర్స్
ఆఫీసర్
మిలింద్
లక్కడ్
ఇటీవల
ఒక
ఇంటర్వ్యూలో
వెల్లడించారు.
ఈ
చర్యల్లో
భాగంగా..
ఉద్యోగులకు
నైపుణ్యం
పెంచుకోవడానికి,
వారి
జీతాలను
రెట్టింపు
చేసే
అవకాశాలను
అందించాలని
కంపెనీ
చూస్తున్నట్లు
లక్కడ్
వెల్లడించారు.
ఒక
పక్క
సంక్షోభంతో
ఏర్పడిన
వ్యాపార
మందగమనం
కారణంగా
చాలా
టెక్
కంపెనీలు
తమ
ఉద్యోగులను
తొలగిస్తూ
పోతోంటే..
టీసీఎస్
మాత్రం
ఫ్రెషర్ల
నియామకం,
వేతనాల
పెంపు
విషయంలో
ఇచ్చిన
మాటకు
కట్టుబడి
ఉన్నట్లు
మిలింద్
లక్కడ్
స్పష్టం
చేశారు.
TCS
ఫ్రెషర్‌లకు
44,000
జాబ్
ఆఫర్‌లను
అందించినట్లు
కంపెనీ
తన
రెగ్యులేటరీ
ఫైలింగ్స్
లో
వెల్లడించింది.
అలాగే
ఫ్రెషర్‌లకు
చేసిన
అన్ని
జాబ్
ఆఫర్‌లను
తాము
గౌరవిస్తామని
కంపెనీ
హామీ
ఇచ్చింది.
అలాగే
జూనియర్
ఉద్యోగులందరికీ
100
శాతం
వేరియబుల్
వేతనాన్ని
చెల్లించాలని
నిర్ణయించినట్లు
టీసీఎస్
తాజాగా
ప్రకటించింది.
వేరియబుల్
వేతనాన్ని
పూర్తిగా
చెల్లించాలని
కంపెనీ
తీసుకున్న
నిర్ణయంపై
ఉద్యోగులు
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.
English summary
Tech jaint TCS announced it will pay 100 percent Variable pay to Junior Employees, Know details
Tech jaint TCS announced it will pay 100 percent Variable pay to Junior Employees, Know details
Story first published: Monday, May 1, 2023, 10:05 [IST]
[ad_2]
Source link
Leave a Reply