[ad_1]
చమోమిలే టీ..
ఈ కూడా మార్కెట్లో టీ పౌడర్స్ అమ్మే చోట లభిస్తుంది. ఆన్లైన్లో కూడా మీరు వీటిని కొనొచ్చు. ఈ టీ అద్భుతమైన మూలిక అని చెప్పొచ్చు. ఈ టీ తాగడం వల్ల ఆందోళనను తగ్గించి, ప్రేగులను శుభ్రంగా చేస్తుంది. గట్ హెల్త్‌ని కాపాడుతుంది. దీంతో అజీర్ణం దూరమవుతుంది. ఈ చమోమిలే టీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది.
ఈ టీని తయారు చేసేందుకు చమోమిలే టీ బ్యాగ్స్, టీ పౌడర్ని 10 నిమిషాలు వేడినీటిలో ఉంచాలి. అవసరం అనుకుంటే తేనె కలిపి తీసుకోవచ్చు. అయితే, బ్లడ్ థినర్ సమస్య ఉంటే ఈ టీ తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే, ఈ టీ వారు తాగడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదముంది.
యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్‌ని చాలా మంది తీసుకుంటారు. దీనిని తీసుకోవడం వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుందని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ, దీనిని తాగడం వల్ల చర్మానికి చాలా మంచిది. అజీర్తి సమస్యల్ని ఇది బెస్ట్ ఆప్షన్.
అజీర్ణంగా అనిపించినప్పుడు వెంటనే ఓ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ని గ్లాసు గోరువెచ్చని నీటిలో తాగండి. మీకు చాలా వరకూ సమస్య పరిష్కారమవుతుంది.
Also Read : Constipation Remedy : ఆముదాన్ని ఇలా తీసుకుంటే మలబద్దకం దూరం..
అయితే, దీనిని మీరు తాగడానికి 30 నిమిషాల ముందు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అదే విధంగా, ఇది మంచిదే అయినప్పటికీ దీనిని నీటిలో కలపకుండా తాగితే దంతాలకు మంచిది కాదు. వికారం, గొంతు మంట, రక్తంలో చక్కెర శాతం తాగడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త.
అల్లం..
అల్లంని ఎన్నో సమస్యలకు మందులా వాడొచ్చు. ఇక అజీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో కూడా అల్లం ఔషధంలా పనిచేస్తుంది. అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు అల్లం టీ తాగడం వల్ల మీకు సమస్య తగ్గుతుంది.
అల్లం టీని తయారు చేసేందుకు ఓ గ్లాసు నీటిలో ఓ స్పూన్ అల్లం ముక్కల్ని వేసి బాగా మరిగించాలి. దీనిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక తేనె, నిమ్మరసం కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. అయితే, దీనిని రోజుకి అల్లాన్ని 3 నుంచి 4 గ్రాములకి మించి తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ అల్లం తీసుకుంటే గ్యాస్, గొంతు మంట వస్తుంది.
Also Read : Cancer : ఈ లక్షణాలు ఉంటే నోటి క్యాన్సర్ ఉన్నట్లేనట..
పిప్పర్మెంట్ టీ..
ఈ టీ మనకి మార్కెట్లో దొరుకుతుంది. పిప్పర్మెంట్ అంటే మరేదో కాదు. తులసి. మీకు టీ పౌడర్ దొరక్కపోతే ఫ్రెష్ తులసి ఆకులతో కూడా ఈ టీని చేసుకుని తాగొచ్చు. దీనిని తాగడం వల్ల త్వరగానే కడుపు సమస్యలు తగ్గుతాయి. వీటిని టీ చేసుకుని తాగొచ్చు. లేదా పుదీనాని అలానే తినొచ్చు కూడా.
అయితే, అజీర్ణ సమస్యని పుదీనా దూరం చేస్తుంది. కానీ, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు దీనిని తీసుకోకపోవడమే మంచిది.
Also Read : Diabetes Winter Care : షుగర్ ఉన్నవారు చలికాలంలో ఈ జాగ్రత్తలు
సోంపు..
సోంపు కూడా జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తిని దూరం చేయడంలో సోంపు బాగా పని చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం, తిమ్మిరి వంటి సమస్యలు దూరమవుతాయి.
కాబట్టి, సోంపుతో టీ చేసుకుని తాగండి. ఇందుకోసం ముందుగా నీటిలో అర టీ స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించండి. దీనిని వడకట్టి తాగండి. అవసరం అనుకుంటే కొద్దిగా తేనె కలపొచ్చు. దీనిని తాగాలి.
అదే విధంగా, అజీర్ణంగా అనిపించినప్పుడు సోంపుని తినడం కూడా బెస్ట్ రిజల్ట్స్‌ని ఇస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply