[ad_1]
వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి..
వెన్నునొప్పి వల్ల లేవడం, కదలడమే కష్టంగా ఉంటుంది. కానీ యోగా, వాటర్ ఏరోబిక్స్, ఏరోబిక్స్, స్విమ్మింగ్, వాకింగ్ వంటి తక్కువ తీవ్రత గల వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌అర్‌సైజ్ చేయడం వల్ల మెదడు న్యాచురల్ పేయిన్ కిల్లర్ అయిన ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది బిగుతుగా మారిన కండరాలను రిలాక్స్ చేస్తుంది, తద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Conjunctivitis:కళ్లు కలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
హాట్ & కోల్డ్ కంప్రెస్‌లను ప్రయత్నించండి..
వాపు, ఒత్తిడిగా ఉన్నప్పుడు వెంటనే కూల్ ప్యాడ్స్ ఆ ప్రాంతంలో ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ వేసి కాపడం పెట్టండి. చల్లదనం కారణం వచ్చే తిమ్మిరి నొప్పి నుంచి ఉశమనం ఇస్తుంది. హీట్ ప్యాడ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి వెన్నునొప్పిని తగ్గిస్తుంది, ఇది ఇది రికవరీని సులభతరం చేస్తుంది.
Kidney Health: షుగర్ పేషెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయ్..!
ఒత్తిడి తగ్గించుకోండి..
పరిశోధన ప్రకారం, MRIలు, డిస్క్ ఇంజెక్షన్ల వంటి క్లినికల్ టెస్టింగ్‌లు మీ బాధను, మాససిక స్థితిని అంచనా వేయలేవు. నడుము నొప్పితో ఇబ్బంది పడేవారిలో మూడు రెట్లు కంటే ఎక్కువ మంది దీర్ఘకాలిక నొప్పి, జీవిత సవాళ్లను ఎదుర్కొన్నవారే ఉన్నారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. నిజానికిది ఆయా పరిస్థితులు, ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి తోడ్పడేదే అయినా నిరంతరం ఉత్పత్తి అవుతూ వస్తుంటే మాత్రం ముప్పు తప్పదు. ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికి దారితీస్తుంది. దీంతో వెన్నెముక మీద భారం పెరుగుతుంది. దీని వల్ల నడుము వచ్చే అవకాశం ఉంది. మీ ఒత్తిడి కారణంగా నడుము నొప్పి తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధాన్యం చేయడం, సంగీతం వినడం, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం వంటివి చేయండి.
ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచండి..
మన శరీరం ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేస్తుంది. మెదడు నొప్పి సంకేతాలను గుర్తించకుండా నిరోధించడానికి ఎండార్ఫిన్లు సహాయపడతాయని చాలా మందికి తెలియదు. నొప్పిని తగ్గించడంతో పాటు, ఎండార్ఫిన్‌లు విచారం, ఉద్రిక్తత, ఆందోళనను దూరం చేస్తుంది. ఇవన్నీ దీర్ఘకాలిక వెన్నునొప్పితో ముడిపడి ఉంటాయి, తరచుగా దానిని మరింత తీవ్రతరం చేస్తాయి.
Bone Health: ఈ ఆసనాలు ప్రాక్టిస్ చేస్తే.. ఎముకలు బలంగా ఉంటాయ్..!
ప్రశాంతంగా నిద్రపోండి..
నిద్రలేమి కారణంగా నడుము నొప్పి తీవ్రం అయ్యే అవకాశం ఉంది. పెద్దవారికి సాధారణంగా రాత్రి పూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన నిద్ర కోసం, నడుము నొప్పి తగ్గించడానికి సరైన నిద్ర భంగిమ అవసరం. మీరు నిద్రపోయేప్పుడు నడుము కింద దిండు పెట్టుకుంటే నడుము మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
మీకు ఏ పనుల వల్ల నడుం నొప్పి ఎక్కువగా వస్తుందో వాటికి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలి. వీటికి తోడు డాక్టర్ సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకోవడం, విటమిన్ డి ఇంజెక్షన్లు, క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం చేస్తుండాలి. ఒకవేళ ఊబకాయం సమస్య ఉంటే తగిన ఆహార నియమాలు పాటించాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply