Tips to Remove Oil Stains: గోడపై నూనె మరకలు వదలట్లేదా..? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

[ad_1]

బేకింగ్‌ సోడాతో ఇలా..

బేకింగ్‌ సోడాతో ఇలా..

గోడపై ఉన్న నూనె మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా ఒక బెస్ట్ హోం రెమెడీ. దీని కోసం, బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. తర్వాత మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన వస్త్రం నీటిలో ముంచి ఆ ప్రదేశంలో తుడవండి. అది ఆరినతర్వాత కొంచెం నూనె మరక కూడా ఉండదు.​

Tomato price hike: టమాటాకు బదులుగా ఇవి వాడేయండి..!

లిక్విడ్‌ డిష్‌ వాషర్‌..

లిక్విడ్‌ డిష్‌ వాషర్‌..

మీరు గొడ నుంచి నూనె మరకను తొలగించడానికి చవకైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, లిక్విడ్ డిష్‌ వాష్‌ ఒక గొప్ప ఎంపిక. లిక్విడ్‌ డిష్‌ వాష్‌ను మరకపై నేరుగా పూయండి. దానిని ఒక గంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఆ చోటున శుభ్రం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన నీటిలో ముంచిన వస్త్రంతో రుద్దండి. ఇలా చేస్తే నూనె మరకలు తొలగుతాయి.

వెనిగర్‌..

వెనిగర్‌..

వంటలో ఉపయోగించే వెనిగర్ నూనె మరకలను తొలగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దాని సహాయంతో, మీరు నిమిషాల్లో చెడు వాసన, గ్రీజు వంటి మొండి మరకలను వదలిస్తుంది.మీరు గోడపైన నూనె మరకలను తొలగించడానికి.. వెనిగర్‌, నీటిని సమాన మొత్తంలో మిక్స్‌ చేయండి. దీనిలో స్పాంజ్‌/ వస్త్రం ముంచి ఆ మరకపై పూయండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత శుభ్రమైన తడి వస్త్రంతో తుడవండి.​

గొంతులో చేప ముళ్లు ఇరుక్కుందా..? వెంటనే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

హెయిర్‌ డ్రైయర్‌తో..

హెయిర్‌ డ్రైయర్‌తో..

గోడపై నూనె మరక ఎక్కువగా ఉంటే, దానిపై ఐరన్‌ బాక్స్‌, హెయిర్ డ్రైయర్‌ మీకు ఎఫెక్టివ్‌గా సహాయపడతాయి. మీరు గోడపై కాగితం ఉంచి.. దాని మీద ఐరన్‌ బాక్స్‌, హెయిర్‌ డ్రైయర్‌ ఉంచండి. ఇలా చేస్తే.. పేరుకుపోయిన జిగురు నూనె అంతా కరిగి బయటకు వస్తుంది. పైన పేర్కొన్న నాలుగు విధానాలలో ఏదొకటి మీకు సహాయపడుతుంది.

(image source – pixabay)

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *