[ad_1]
చింతపండు వాడేయండి..
చాలా వంటల్లో పులుపుదనం కోసం టమాటాల్ని వాడుతుంటాం. టమాటాలకు బదులు చింతపండు, చింతపండు గుజ్జు వాడినా మంచి రుచిని ఇస్తుంది. ఇది కూరకు పులుపుతో పాటు.. చిక్కదనం కూడా ఇస్తుంది.
(image source – pixabay)
వెనిగర్..
వినిగార్ టమాటాలకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు. ఇది వంటలకు పుల్లని, ఘాటైన రుచిని ఇస్తుంది. టమాటాల వాడకాన్ని తగ్గించుకోవడానికి.. కొన్ని వంటల్లో వెనిగర్‌ను వాడొచ్చు.
ఉసరి పొడి, ఆమ్‌చూర్..
ఉసిరి పొడి, ఆమ్‌చూర్ పౌడర్.. పుల్లగా ఉంటాయి. ఇవి కూరలకు రుచని ఇవ్వడంతో పాటు.. పులుపుదనాన్నిస్తాయి. కూరకు పులుపు టేస్ట్ రావాలంటే.. ఏదో ఒక పొడిని చిటికెడు వేయండి. ఇవి టమాటాకు బెస్ట్ రీప్లేస్‌మెంట్ అనొచ్చు.
గుజ్జు కోసం ఉల్లిపాయ..
చాలా మంది కూరల్లో గుజ్జు కోసం టమాటాలను వాడుతూ ఉంటారు. గ్రీవీ కోసం.. టమాటాకు బదులు ఉల్లిపాయలను వాడండి. ఉల్లిపాయల్ని దోరగా వేయించి పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని కూరల్లో వాడుకోవచ్చు. అయితే అది కూడా తక్కువగా వాడితేనే కూర ఘాటుగా ఉండకుండా, దాని రుచి మారిపోకుండా ఉంటుంది.
(image source – pixabay)
మామిడి కాయ..
టమాటాకు బదులు మామిడి కాయలను కూరల్లో వాడొచ్చు. మామిడి ముక్కలను పేస్ట్ చేసి కూరలో వేస్తే.. మంచి టేస్ట్ వస్తుంది.
(image source – pixabay)
రెడ్ క్యాప్సికమ్..
కూరకు మంచి రంగు ఇవ్వడానికి టమాటాను వేస్తూ ఉంటారు. మీరు టమాటాకు బదులుగా ఎర్ర రంగు క్యాప్సికమ్‌ను కూరల్లో వాడొచ్చు. శ్యాండివిచ్, బర్గర్‌లో టమాటాకు బదులు రెడ్ క్యాప్సికమ్ వాడండి. అలాగే కొన్ని రకాల స్నాక్స్, సలాడ్స్‌లో టొమాటోకు బదులుగా.. కెచప్‌ని వాడండి.
(image source – pixabay)
[ad_2]
Source link
Leave a Reply