Torrent Power: టొరెంట్ పవర్ మూడు ప్రాజెక్టుల జాక్‌పాట్‌.. ఆల్‌టైం రికార్డు స్థాయికి షేర్‌ వాల్యూ

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Torrent
Power:

ప్రముఖ
పునరుత్వాదక
శక్తి
సంస్థ
టోరెంట్
పవర్‌
ఇప్పుడు
స్టోరేజ్
సొల్యూషన్స్
స్పేస్‌లోకి
ప్రవేశించింది.
3
హైడ్రో
ప్రాజెక్టుల
కోసం
మహారాష్ట్ర
ప్రభుత్వంతో
అవగాహన
ఒప్పందం
కుదుర్చుకున్నట్లు
ప్రకటించింది.
దీంతో
ఇంట్రా-డేలో
టొరెంట్
పవర్‌
షేర్లు
రికార్డు
స్థాయిలో
దాదాపు
9
శాతం
మేర
లాభపడ్డాయి.

5
వేల
700
మెగావాట్ల
సామర్థ్యం
గల
3
పంప్‌డ్
స్టోరేజీ
హైడ్రో
ప్రాజెక్ట్‌ల
కోసం

ఒప్పందం
జరిగినట్లు
తెలుస్తోంది.
“ఈ
ప్రాజెక్టుల
పెట్టుబడి
సుమారు
27
వేల
కోట్లు.
నిర్మాణ
కాలంలో
సుమారు
13
వేల
500
మందికి
ఉపాధిని
కల్పిస్తాయి.
వీటిని
5
సంవత్సరాల
వ్యవధిలో
అమలు
చేయాలని
టొరెంట్
భావిస్తోంది”
అని
ఎక్స్ఛేంజ్
ఫైలింగ్‌లో
కంపెనీ
తెలిపింది.

Torrent Power: టొరెంట్ పవర్ మూడు ప్రాజెక్టుల జాక్‌పాట్‌..


వార్తల
నేపథ్యంలో
టొరెంట్
పవర్
ఇంట్రా-డే
డీల్స్‌లో
8.8
శాతం
పెరిగి
రికార్డు
గరిష్ట
స్థాయి
666కి
చేరుకుంది.
దీంతో
జనవరి
30,
2023న
నమోదైన
52
వారాల
కనిష్ఠ
స్థాయి
430.90
కంటే
54
శాతం
ఎక్కువగా
ఉన్నట్లయింది.
గత
ఏడాదిలో
33
శాతం
మరియు
2023
నుంచి
ఇప్పటి
వరకు
35
శాతం
స్టాక్
పురోగమించింది.
మే
తర్వాత
జూన్‌లో
ఇప్పటివరకు
19
శాతానికి
పైగా
పెరిగింది.

రాయ్‌గఢ్
జిల్లాలోని
కర్జాత్
లో
3
వేల
మెగావాట్లు,
పూణే
జిల్లాలోని
మావల్
లో
1,200
మెగావాట్లు,
జున్నార్
లో
1,500
మెగావాట్లతో..
టొరెంట్
గుర్తించిన
మూడు
ప్రదేశాలలో

ప్రాజెక్టులను
అమలు
చేయనున్నట్లు
కంపెనీ
తెలిపింది.
రోజువారీ
ప్రాతిపదికన
కనీసం
ఆరు
గంటల
ఎనర్జీ
స్టోరేజ్‌ను
అందించే
విధంగా

ప్రాజెక్ట్‌లు
రూపొందించబడినట్లు
వెల్లడించింది.

English summary

Torrent power record high nearly 9% after signing 3 project with Maharashtra government

Torrent power record high nearly 9% after signing 3 project with Maharashtra government

Story first published: Wednesday, June 7, 2023, 14:41 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *