Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..

[ad_1]

సంచలన నిర్ణయం..

సంచలన నిర్ణయం..

Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉండటం వల్ల ఖాతాదారులు డబ్బును సంపాదించే ప్రయోజనాన్ని ఎలాన్ మస్క్ తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ఇప్పుడు తమ రిప్లై థ్రెడ్ ద్వారా వచ్చే ప్రకటన ఆదాయంలో కొంత భాగాన్ని చందాదారులకు చెల్లిస్తుందని CEO ఎలోన్ మస్క్ వెల్లడించారు. ప్రత్యుత్తర థ్రెడ్‌లలో కనిపించే ప్రకటనల కోసం క్రియేటర్‌లతో ప్రకటన ఆదాయాన్ని పంచుకుంటుందని మస్క్ వెల్లడించారు. ఈ యాడ్ రెవెన్యూ పొందటానికి ముందుగా ఖాతాదారులు Twitter బ్లూ వెరిఫైడ్‌కు సబ్‌స్క్రైబర్ అయి ఉండాలి.

భారతీయులకు వర్తిస్తుందా..?

ట్విట్టర్ అధికారిక వెబ్‌సైట్ లోని సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఈనెల 3న ప్రకటించిన రెవెన్యూ షేరింగ్ ఆఫర్ కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వివరాల ప్రకారం అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అంటే ప్రస్తుతం ఈ ఆఫర్ భారతీయ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో లేదని తెలుస్తోంది.

త్వరలో ఇండియాకు..

త్వరలో ఇండియాకు..

ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సేవలు ఇండియాలో లేనప్పటికీ రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అప్పుడు ఇక్కడి యూజర్లకు సైతం ప్రకటనల ఆదాయాన్ని పొందే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్విట్టర్ ఇటీవల ట్వీట్ ఎడిట్ ఆప్షన్, ట్వీట్ ఒపీనియన్ రద్దు చేయటం, బుక్‌మార్క్ ఫోల్డర్‌లు, పొడవైన వీడియోల అప్‌లోడ్‌, ‘స్పేసెస్’ ట్యాబ్ వంటి అనేక ఇతర ప్రత్యేక లక్షణాలను తన సేవల్లో జోడించింది.

ట్విట్టర్ గోల్డ్ విషయంలో..

ట్విట్టర్ గోల్డ్ విషయంలో..

ట్విట్టర్ బ్లూ మాదిరిగా వ్యాపారుల కోసం ట్విట్టర్ గోల్డ్ బ్యాడ్జ్‌ అందిస్తోంది. అయితే దీనిని పొందటానికి నెలకు వారు 1000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులకు ట్విట్టర్ చెప్పింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు 85,000 రూపాయలు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గోల్డ్ టిక్ మార్క్ ఉన్న ఎవరైనా కంపెనీ నిర్ణయించిన రుసుము చెల్లించక పోతే చివరికి బ్యాడ్జ్‌ను కోల్పోతారు. అయితే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాల్సిందే.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *