Twitter rival: అందుబాటులోకి బ్లూస్కై అండ్రాయిడ్ యాప్.. ఇక ట్విట్టర్ ఆధిపత్యానికి బ్రేక్ పడటం దాదాపు ఖాయం

[ad_1]

News

oi-Bhusarapu Pavani

|


Twitter
rival:
అధిక
మొత్తం
వెచ్చించి
ట్విట్టర్
ను
కొనుగోలు
చేసిన
అపర
కుబేరుడు
ఎలాన్
మస్క్
కు
మరో
తలనొప్పి
మొదలైంది.
ఇదే
కంపెనీకి
చెందిన
మాజీ
CEO
జాక్
డోర్సే
రూపొందించిన
బ్లూస్కై
ఇప్పుడు
ట్విట్టర్
కు
ప్రత్యర్థిగా
రంగంలోకి
దిగింది.
గత
నెలలోనే
iOS
ఆధారిత
యాప్
రిలీజ్
చేసిన
సంస్థ..
ఇప్పుడు
తాజాగా
అండ్రాయిడ్
బీటా
వెర్షన్
టెస్టింగ్
స్టార్ట్
చేసింది.

బ్లూస్కై
యాప్
పబ్లిక్
‌గా
అందుబాటులోకి
రాకముందే
ఇప్పుడు
బీటా
వెర్షన్
ప్రయత్నించాలనుకునే
వారు
వెయిటింగ్
‌లిస్టులో
చేరవచ్చు.
ప్రత్యామ్నాయంగా
స్నేహితుల
నుంచి
ఇన్విటేషన్
కోడ్
ద్వారా
ఇందులో
పాలుపంచుకోవచ్చు.
ఫిబ్రవరి
17న
దీనిని
ప్రారంభించగా..
ఇప్పటివరకు
2
వేల
మంది
బీటా
టెస్టర్లు
ఇందులో
భాగమయ్యారు.
గూగుల్
ప్లే
స్టోర్
లోనూ
5
వేల
కంటే
ఎక్కువ
మంది
డౌన్లోడ్
చేసుకున్నట్లు
తెలుస్తోంది.

Twitter rival: అందుబాటులోకి బ్లూస్కై అండ్రాయిడ్ యాప్..

సాధారణ
ఇంటర్‌
ఫేస్‌
కలిగి
ఉన్న
బ్లూస్కై..
కొన్నింటిలో
ట్విట్టర్‌
ని
పోలి
ఉంటుంది.
ఇందులో
ప్లస్
బటన్‌
క్లిక్
చేసి
వినియోగదారులు
256
అక్షరాల
పోస్ట్‌
ను
సృష్టించవచ్చు.
ట్విట్టర్
లోని
‘What’s
happening?’కి
బదులుగా
బ్లూస్కైలో
‘What’s
up?’
అని
అడుగుతుంది.
యూజర్లు
స్వంత
ఫిల్టర్‌లు,
లేబుళ్లను
సృష్టించడానికి
లేదా
సోషల్
మీడియా
ఫీడ్‌లను
వ్యక్తిగతీకరించడానికి
అవకాశం
ఇవ్వాలని
కంపెనీ
భావిస్తోంది.
ఇందుకోసం
థర్డ్
పార్టీ
సేవలను
ఉపయోగించడానికి
అనుమతించాలని
యోచిస్తోంది.
తద్వారా
వినియోగదారులు
చూసే
వాటిపై
మరింత
నియంత్రణ
కలిగి
ఉంటారని
తెలుస్తోంది.

‘మోడరేషన్
అనేది
సామాజిక
మాధ్యమాలకు
అవసరమైన

లక్షణం.
దీని
ద్వారా
చెడు
ప్రవర్తన
నిర్బంధించబడుతుంది.
నిబంధనలు
సెట్
చేయబడతాయి
మరియు
వివాదాలు
పరిష్కరించబడతాయి.
బ్లూస్కై
యాప్‌ను
Invite-onlyగా
మాత్రమే
అందుబాటులో
ఉంచాము.
పూర్తిగా
ప్రజల్లోకి
తీసుకొచ్చేముందు
వినియోగదారుల
భద్రతకు
ప్రాధాన్యత
ఇవ్వడం
కోసం
మోడరేషన్
పూర్తి
చేస్తున్నాము’
అని
కంపెనీ
CEO
జే
గ్రాబెర్
ఒక
బ్లాగ్
పోస్ట్‌లో
వెల్లడించారు.

English summary

Twitter rival Bluesky android beta version released in market

Bluesky beta for android

Story first published: Thursday, April 20, 2023, 18:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *