unemployment: మూడు నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు.. దెబ్బేసిన IT, స్టార్టప్ విభాగాలు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

unemployment: దేశంలో నిరుద్యోగిత రేటు మరోసారి పెరిగింది. స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా.. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటి వివిధ పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు.. భారత్‌ లోని బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, IT రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

గత నాలుగు నెలలుగా ఇండియాలో నిరుద్యోగిత రేటు 7 నుంచి 8 శాతం మధ్య ఊగిసలాడుతోంది. డిసెంబర్ 2022లో 8.30 శాతం ఉండగా.. జనవరి 2023లో 7.14, ఫిబ్రవరిలో 7.45 శాతానికి ఎగబాకినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా తెలిపింది. కాగా ప్రస్తుతం భారత జాబ్ మార్కెట్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో మార్చిలో నిరుద్యోగం 3 నెలల గరిష్ఠ స్థాయి 7.8 శాతానికి పెరిగింది.

unemployment: మూడు నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు..

గత నెల మార్చిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 8.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదైనట్లు CMIE మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ తెలిపారు. ఫిబ్రవరిలో ఉపాధి 409.9 నుంచి 407.6 మిలియన్లకు పడిపోయింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా హర్యానాలో 26.8, ఉత్తరాఖండ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లలో అత్యల్పంగా 0.8 శాతం చొప్పున నిరుద్యోగిత ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

అక్టోబర్-జనవరి తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇ-కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గిందని CIEL HR సర్వీసెస్ డైరెక్టర్ ఆదిత్య మిశ్రా తెలిపారు. IT, టెక్నాలజీ మరియు స్టార్టప్‌లు సహా పలు రంగాల్లో నియామకాలు తగ్గించడం ఇందుకు కారణమని చెప్పారు. మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగింపు, వివిధ పరీక్షలు ఉండటంతో.. విశ్రాంతి, ప్రయాణం, పర్యాటకం, వినోదం మరియు ఆతిథ్య రంగాల్లో పెద్దగా కనిపించడం లేదన్నారు.

English summary

India’s unemployment raised 3 months high to 7.8%

Unemployment rate in India

Story first published: Saturday, April 1, 2023, 23:05 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *