Union Bank: డబుల్ ధమాకా లాభాల్లో యూనియన్ బ్యాంక్.. ఇన్వెస్టర్స్ ఖుషీ..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Union
Bank
Q1
Results:
ప్రస్తుతం
దేశంలోని
ప్రభుత్వ
రంగ
బ్యాంకులు
మంచి
లాభాలను
నమోదు
చేస్తున్నాయి.
చాలా
బ్యాంకులను
విలీనం
చేయటం
ద్వారా
వాటి
లాభాలు
సైతం
పెరిగాయి.
ప్రైవేటు
రంగంతో
పోటీపడుతూ
ఇన్వెస్టర్లకు
మంచి
రాబడులను
అందిస్తున్నాయి.

జూలై
20న
యూనియన్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
మెుదటి
త్రైమాసికంలో
దాని
స్టాండ్‌లోన్
నికర
లాభం
107
శాతానికి
పైగా
పెరిగి
రూ.3,236.44
కోట్లకు
చేరుకున్నట్లు
ప్రకటించింది.
గత
ఏడాది
కంపెనీ
లాభం
రూ.1,558.46
కోట్లుగా
ఉంది.
ప్రధానంగా
ఆస్తి
నాణ్యత
పెరుగుదల,
తక్కువ
కేటాయింపులు,
నికర
వడ్డీ
ఆదాయం
పెరుగుదల
సూపర్
లాభాలకు
దారితీసినట్లు
వెల్లడైంది.

Union Bank: డబుల్ ధమాకా లాభాల్లో యూనియన్ బ్యాంక్.. ఇన్వెస్టర

ఏప్రిల్-జూన్
త్రైమాసికంలో
బ్యాంక్
వడ్డీయేతర
ఆదాయం
38.57
శాతం
పెరిగి
రూ.3,903
కోట్లకు
చేరుకున్నట్లు
బ్యాంక్
నివేదించింది.
జూన్
త్రైమాసికంలో
బ్యాంక్
నికర
వడ్డీ
మార్జిన్లు
3.13
శాతానికి
పెరిగాయి.
నికర
వడ్డీ
మార్జిన్లు
అనేది
బ్యాంక్
సంపాదించిన
వడ్డీ,
దాని
రుణదాతలకు
చెల్లించే
వడ్డీ
మధ్య
వ్యత్యాసాన్ని
సూచిస్తుంది.
స్థూల
నాన్-పెర్ఫార్మింగ్
అసెట్(NPA)
నిష్పత్తి
288
bps
మెరుగుపడింది.
నికర
NPA
సంవత్సరం
క్రితం
కాలంతో
పోలిస్తే
173
bps
తగ్గింది.

రిపోర్టింగ్
త్రైమాసికంలో
బ్యాంక్
ప్రొవిజన్
కవరేజ్
నిష్పత్తి
కూడా
611
bps
పెరిగి
90.86
శాతానికి
చేరుకుంది.
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరం
మొదటి
త్రైమాసికంలో
బ్యాంక్
మొత్తం
కేటాయింపులు
స్వల్పంగా
1.38
శాతం
పెరిగి
రూ.3,943
కోట్లకు
చేరుకున్నాయి.
అలాగే
ఏప్రిల్-జూన్‌లో
గ్లోబల్
అడ్వాన్స్‌లు
రూ.8.19
లక్షల
కోట్లు,
దేశీయ
అడ్వాన్సులు
రూ.7.94
లక్షల
కోట్లుగా
ఉన్నట్లు
బ్యాంక్
వెల్లడించింది.

English summary

Public sector Union Bank doubled Q1 profits comparing to last year, Investors happy

Public sector Union Bank doubled Q1 profits comparing to last year, Investors happy

Story first published: Friday, July 21, 2023, 10:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *